శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

పంజాబ్ జట్టు తన తొలి మ్యాచ్‌లో గుజరాత్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కూపర్ కొనోలీ విజేతగా నిలిచాడు.

Published By: HashtagU Telugu Desk
Shreyas Iyer

Shreyas Iyer

Shreyas Iyer: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తన తదుపరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు పంజాబ్ జట్టుకు ఒక శుభవార్త అందింది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించి, మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బంతి తగలడంతో శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. ఆ సమయంలో అయ్యర్‌ తీవ్ర నొప్పితో ఇబ్బంది పడ్డాడు. పీటీఐ సమాచారం ప్రకారం.. వైద్యులు చేసిన స్కాన్‌లో అయ్య‌ర్‌కు ఎలాంటి ప్రమాదం లేదని, పూర్తిగా కోలుకున్నాడ‌ని స్పష్టమైంది.

శ్రేయస్ అయ్యర్‌కు గాయం ఎలా అయ్యింది?

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు శ్రేయస్ అయ్యర్‌కు గాయమైంది. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్ చేస్తున్నాడు. కూపర్ కొనోలీ బ్యాటింగ్ చేస్తుండగా కెప్టెన్ అయ్యర్ నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నాడు. ఐదవ బంతిని కొనోలీ బలంగా కొట్టగా, అది నేరుగా నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ చేతికి బలంగా తగిలింది. ఆ బంతి నుండి తప్పించుకునే అవకాశం కూడా దక్కలేదు. బంతి తగిలిన తర్వాత అయ్య‌ర్ తీవ్ర నొప్పితో బాధపడ్డాడు. వెంటనే మెడికల్ టీమ్ మైదానంలోకి వచ్చి చికిత్స అందించింది. ప్రాథమిక చికిత్స తర్వాత అయ్య‌ర్‌ ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ను కొనసాగించాడు.

Also Read: ఈది రాజధాని రైతుల విజయం.రేణుకా చౌదరి

చెన్నై సూపర్ కింగ్స్‌తో తదుపరి మ్యాచ్

పంజాబ్ జట్టు తన తొలి మ్యాచ్‌లో గుజరాత్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కూపర్ కొనోలీ విజేతగా నిలిచాడు. 44 బంతుల్లో 72 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే పంజాబ్‌కు తదుపరి సవాలు అంత సులభం కాదు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో పంజాబ్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 3న జరగనుంది.

  Last Updated: 02 Apr 2026, 03:39 PM IST