IPL Fastest Ball: ఫెర్గ్యుసన్ దే ఐపీఎల్ 2022 ఫాస్టెస్ట్ బాల్

ఐపీఎల్ 15వ సీజన్ మొదలైనప్పటి నుంచీ ఫాస్టెస్ట్ బాల్ పోటీ సన్‌రైజర్స్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ , గుజరాత్ టైటాన్స్ పేసర్ ఫెర్గ్యుసన్ మధ్యే నెలకొంది.

  • Written By:
  • Publish Date - May 30, 2022 / 09:55 AM IST

ఐపీఎల్ 15వ సీజన్ మొదలైనప్పటి నుంచీ ఫాస్టెస్ట్ బాల్ పోటీ సన్‌రైజర్స్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ , గుజరాత్ టైటాన్స్ పేసర్ ఫెర్గ్యుసన్ మధ్యే నెలకొంది. ఎక్కువ సార్లు ఉమ్రాన్‌ మాలిక్‌ దే పై చేయిగా నిలిచింది. దాదాపు ప్రతీ మ్యాచ్ లోనూ తన బౌలింగ్ వేగం పెంచుకుంటూ వచ్చిన ఉమ్రాన్‌ మాలిక్‌ చివరికి 157 కి.మీ. వేగంతో ఫాస్టెస్ట్ బాల్ వేసి రికార్డు సృష్టించాడు.

ఫైనల్‌ మ్యాచ్‌ వరకూ ఇదే రికార్డుగా ఉంది. దీనిని బ్రేక్‌ చేయడం అంత సులువు కాదని భావించినా.. ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్‌ బౌలర్‌ లాకీ ఫెర్గూసన్‌ ఈ రికార్డు బ్రేక్‌ చేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో ఫెర్గూసన్‌ అంతకంటే వేగవంతమైన బాల్‌ వేశాడు. గంటకు 157.3 కి.మీ. వేగంతో అతడు బౌలింగ్‌ చేసాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌కు అతడీ ఫాస్టెస్ట్‌ డెలివరీ వేశాడు సంధించాడు. రాయల్స్‌ ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ చివరి బాల్‌ను 157.3 కి.మీ. వేగంతో విసిరాడు. అది కూడా ఆఫ్‌స్టంప్‌కు దూరంగా పడిన యార్కర్‌ లెంత్‌ బాల్‌ కావడంతో బట్లర్‌ ఆ బాల్‌ను టచ్‌ కూడా చేయలేకపోయాడు. ఈ ఫాస్టెస్ట్ డెలివరీతో ఫెర్గూసన్ రూ.10 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.

ఐపీఎల్‌ లీగ్‌ స్టేజ్‌లోనూ ఫాస్టెస్ట్ డెలివరీ రేసు ఉమ్రాన్‌ మాలిక్‌, ఫెర్గూసన్‌ మధ్యే నడిచింది. ఒక మ్యాచ్‌లో 153.9 కి.మీ. వేగంతో ఫెర్గూసన్‌ బౌలింగ్‌ చేసి రికార్డు నెలకొల్పగా.. ఉమ్రాన్‌ 154 కి.మీ. వేగంతో ఆ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఆ తర్వాత తన స్పీడును మరింత పెంచి గంటకు 157 కి.మీ. వేగంతో బౌలింగ్‌ చేసి ఆశ్చర్య పరిచాడు. ఓవరాల్ గా ఐపీఎల్ చరిత్రలో ఫెర్గుసన్ వేసిన బాల్ రెండో ఫాస్టెస్ట్ బాల్ గా నిలిచింది. ఇప్పటి వరకూ రాజస్థాన్ రాయల్స్ మాజీ పేసర్ షాన్ టైట్ 157.7 కి.మీ. వేగంతో వేసిన బాల్ మొదటి స్థానంలో ఉంది. ఓవరాల్ ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ బాల్ టాప్ ఫైవ్ జాబితాలో రెండు బాల్స్ ఉమ్రాన్ మాలిక్ పేరిటే ఉన్నాయి.