Site icon HashtagU Telugu

Ishan Kishan: ఐపీఎల్ 2026.. ఈ ఆట‌గాడి కోసం మూడు ఫ్రాంచైజీల పోటీ!

Ishan Kishan

Ishan Kishan

Ishan Kishan: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ సన్నాహాలను మెల్లగా పూర్తి చేసుకుంటున్నాయి. రాబోయే సీజన్‌కు ముందు చాలా మంది ఆటగాళ్లపై వేలంపాట జరగనుంది. మరికొందరు అంచనాలకు అందకుండా పోవచ్చు. గత ఐపీఎల్ 2025 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఇషాన్ కిషన్‌ (Ishan Kishan)ను తమ జట్టులోకి తీసుకుంది. అయితే అతను పెద్దగా రాణించలేకపోయాడు. అయినప్పటికీ ఇప్పుడు మూడు ఫ్రాంచైజీలు ఇషాన్ కిషన్‌ను ట్రేడ్ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ఇషాన్ కిషన్‌ను ట్రేడ్ చేసుకునేందుకు హోరాహోరీ

ఓ నివేదిక ప్రకారం.. ఇషాన్ కిషన్‌పై మూడు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి. ఆ మూడు ఫ్రాంచైజీలలో ముంబై ఇండియన్స్ (MI), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాజస్థాన్ రాయల్స్ (RR) ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలు ఇషాన్ కిషన్‌ను తమ జట్టులో భాగం చేసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్.. ఇషాన్ కిషన్‌ను ట్రేడ్ లేదా పూర్తి నగదు డీల్ (Full Cash Deal) కోసం SRHను సంప్రదించాయి. ఈ ఫ్రాంచైజీలకు హైదరాబాద్ ఎలాంటి సమాధానం ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read: Bihar Elections: బీహార్ ఎన్నికలు 2025.. తొలి దశలో 467 నామినేషన్లు రద్దు!

గత సీజన్‌లో ఇషాన్ ప్రదర్శన ఎలా ఉంది?

ఇషాన్ కిషన్ గత సీజన్‌లో SRH తరఫున 14 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 35.40 సగటుతో 354 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. గత సీజన్‌లో ఇషాన్ మొదటి, చివరి మ్యాచ్‌లలో మాత్రమే సెంచరీలు చేశాడు. మిగతా మ్యాచ్‌లలో ఇషాన్ బ్యాట్ నుంచి పరుగులు పెద్దగా రాలేదు.

ఇషాన్ కెరీర్ రికార్డు

ఇషాన్ ఇప్పటివరకు 119 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 29.10 సగటుతో 2998 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇషాన్ ఇప్పటివరకు మొత్తం 288 ఫోర్లు, 134 సిక్సర్లు కొట్టాడు. 2016లో ఇషాన్ గుజరాత్ లయన్స్ తరఫున ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2018లో ముంబై ఇండియన్స్ అతన్ని తమ జట్టులోకి తీసుకుంది. ఇప్పటివరకు అతను మూడు ఫ్రాంచైజీల తరఫున ఆడాడు.

Exit mobile version