IPL 2026 : IPL అభిమానులకు గుడ్ న్యూస్.. మార్చి 28 నుండి IPL సీజన్ స్టార్ట్

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీ 2026, మార్చి 28 నుంచి ప్రారంభం కానుందని అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది.

Published By: HashtagU Telugu Desk
IPL History

IPL History

IPL 2026 to start from March 28 : IPL క్రికెట్ పండుగకు ముహూర్తం ఖరారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీ 2026, మార్చి 28 నుంచి ప్రారంభం కానుందని అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం మే 31న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. త్వరలో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, బీసీసీఐ ఈసారి షెడ్యూల్‌ను రెండు విడతల్లో విడుదల చేసే అవకాశం ఉంది. మొదటి దశలో దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు జరిగే మ్యాచ్‌ల వివరాలను వెల్లడించి, ఆ తర్వాత పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆర్సీబీ ఐపీఎల్ సంప్రదాయం ప్రకారం, గత సీజన్ విజేత హోమ్ గ్రౌండ్‌లోనే తొలి మ్యాచ్ జరుగుతుంది. ఆ లెక్కన డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి పోరులో తలపడనుంది. గత ఏడాది టైటిల్ గెలిచిన తర్వాత బెంగళూరులో జరిగిన అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో, ఈసారి స్టేడియం భద్రతపై కేఎస్‌సీఏ (KSCA) ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కేవలం 35,000 మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతినిస్తూ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

కొత్త రికార్డులు.. మరిన్ని మ్యాచ్‌లు ఈ సీజన్ నుంచి ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరగనుంది. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో ఈసారి 84 మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆర్సీబీ తన హోమ్ మ్యాచ్‌లలో ఐదు మ్యాచ్‌లను బెంగళూరులో, మిగిలిన రెండు మ్యాచ్‌లను రాయ్‌పూర్ వేదికగా ఆడనుంది. ఈసారి వేలంలో భారీ ధర పలికిన స్టార్ ప్లేయర్లు, కుర్ర సంచలనాలు ఏ మేరకు రాణిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మార్చి 28న ప్రారంభమయ్యే ఈ సమరం మే చివరి వరకు దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్‌ను పెంచనుంది.

  Last Updated: 08 Mar 2026, 06:59 PM IST