ఇంగ్లాండ్‌తో సెమీ ఫైన‌ల్ పోరు.. చ‌రిత్ర సృష్టించిన భార‌త్‌!

భారత ఇన్నింగ్స్‌లో మొత్తం 19 సిక్సర్లు, 18 ఫోర్లు నమోదయ్యాయి. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలు 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించారు. శివమ్ దూబే తన శక్తిని ప్రదర్శిస్తూ కేవలం ఒక ఫోర్ కొట్టి, 4 సిక్సర్లను బాదాడు.

Published By: HashtagU Telugu Desk
India vs England

India vs England

India vs England: 2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత ఓవర్లలో 253 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సంజూ శాంసన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. శివమ్ దూబే కూడా మెరుపులు మెరిపించారు.

భారత్ భారీ స్కోరు

టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది (2012 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై 205 పరుగులు). నాకౌట్ మ్యాచ్‌ల్లో 200 పరుగుల మార్కును దాటిన జట్లు భారత్, వెస్టిండీస్ మాత్రమే. అంతేకాకుండా నాకౌట్ మ్యాచ్‌ల్లో 250 పరుగుల మార్కును దాటిన ప్రపంచపు తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.

Also Read: Rajyasabha : రాజ్యసభ పోటీకి దూరంగా బిఆర్ఎస్..ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కేనా ?

విరాట్ కోహ్లీ సరసన శాంసన్

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ త్వరగా అవుటైనప్పటికీ సంజూ శాంసన్ రన్‌రేట్ తగ్గకుండా చూసుకున్నారు. 42 బంతుల్లో 89 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డును శాంసన్ సమం చేశారు. తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదారు. 2026 టీ20 ప్రపంచకప్‌లో శాంసన్‌కు ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ.

స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి శివమ్ దూబేను నంబర్-3లో బ్యాటింగ్‌కు పంపారు. టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెడుతూ అతను 25 బంతుల్లో 43 పరుగులు చేశారు. దూబే బ్యాటింగ్ జోరు కొనసాగుతుండగా, దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు.

19 సిక్సర్లు, 18 ఫోర్లు

భారత ఇన్నింగ్స్‌లో మొత్తం 19 సిక్సర్లు, 18 ఫోర్లు నమోదయ్యాయి. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలు 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించారు. శివమ్ దూబే తన శక్తిని ప్రదర్శిస్తూ కేవలం ఒక ఫోర్ కొట్టి, 4 సిక్సర్లను బాదాడు.

  Last Updated: 05 Mar 2026, 09:17 PM IST