IND vs NAM: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఈరోజు భారత క్రికెట్ జట్టు నమీబియాతో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్‌కు ముందు అభిషేక్ శర్మ ఫిట్‌నెస్ టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. అంతకుముందు అనారోగ్యంతో ఉన్నప్పటికీ అభిషేక్ అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. మరి నేడు నమీబియాతో జరిగే మ్యాచ్‌లో అతను ఆడతాడా లేదా? టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ పై తాజా అప్‌డేట్ ఏంటో చూద్దాం!
అభిషేక్ శర్మ ఆడతాడా?
భారత్ వర్సెస్ నమీబియా మ్యాచ్‌కు ముందు రోజు సాయంత్రం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తిలక్ వర్మ మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. అయితే అతను తుది జట్టులో ఉంటాడా లేదా అనే నిర్ణయం మ్యాచ్‌కు ముందే తీసుకుంటామని చెప్పారు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో అభిషేక్ పాల్గొనలేదు.
Also Read: గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా రహస్య అణు పరీక్షలు
ముందున్న కీలక మ్యాచ్‌ల దృష్ట్యా అభిషేక్ కోలుకోవడానికి టీమ్ మేనేజ్మెంట్ తగినంత సమయం ఇవ్వాలని భావిస్తోంది. అందుకే అతని విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ నమీబియా మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు సంజూ శాంసన్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తూ కనిపించాడు. దీన్ని బట్టి చూస్తే నేటి మ్యాచ్‌లో అభిషేక్ స్థానంలో సంజూ శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఎవరితో ఓపెనింగ్ చేస్తారు?
న్యూజిలాండ్‌తో జరిగిన గత సిరీస్‌లో సంజూ శాంసన్‌కు మొత్తం 5 మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ చేసే అవకాశం లభించింది. కానీ అతను 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 46 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరోవైపు ఇషాన్ కిషన్ తనకు వచ్చిన అవకాశాలను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. తన ఫామ్ కారణంగా ఇషాన్ కిషన్ ప్రస్తుతం ఓపెనర్‌గా జట్టులో పాతుకుపోయాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో నమీబియాతో జరిగే పోరులో ఇషాన్ కిషన్- సంజూ శాంసన్ కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.
