ఇంగ్లాండ్‌తో భారత్ కీల‌క పోరు.. అభిషేక్ శ‌ర్మ‌కు నో ప్లేస్‌?!

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ పెద్దగా రాణించలేదు. ఆడిన 6 మ్యాచ్‌ల్లో అతను మూడుసార్లు డకౌట్ అయ్యాడు. తన 6 ఇన్నింగ్స్‌ల్లో 0, 0, 0, 15, 55, 10 పరుగులు మాత్రమే చేశాడు.

Published By: HashtagU Telugu Desk
Team India

Team India

Abhishek Sharma: 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ మార్చి 5న జరగనుంది. ఈ డూ ఆర్ డై పోరులో విజయం సాధించాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. సెమీఫైనల్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఓడిపోయిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ప్లేయింగ్ 11లో పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అభిషేక్ శర్మను ప్లేయింగ్ 11 నుంచి తప్పించవచ్చు.

అభిషేక్ శర్మకు ఉద్వాసన పలికే అవకాశం

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ పెద్దగా రాణించలేదు. ఆడిన 6 మ్యాచ్‌ల్లో అతను మూడుసార్లు డకౌట్ అయ్యాడు. తన 6 ఇన్నింగ్స్‌ల్లో 0, 0, 0, 15, 55, 10 పరుగులు మాత్రమే చేశాడు. సెమీఫైనల్‌కు ముందు అతడిని పక్కన పెట్టే అవకాశం ఉంది. అభిషేక్ స్థానంలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా బాధ్యతలు చేపట్టవచ్చు. గత మ్యాచ్‌లో సంజూ అద్భుతమైన 97 పరుగుల ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించిన విషయం తెలిసిందే.

Also Read: అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌ల ను ఆశీర్వదించిన లోకేశ్‌ దంపతులు

మిడిల్ ఆర్డర్‌లో చోటు దక్కేది..

నెంబర్ 3 స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ బాధ్యతలు చేపట్టవచ్చు. అలాగే నెంబర్ 4 స్థానంలో తిలక్ వర్మకు అవకాశం దక్కవచ్చు. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్ బ్యాటింగ్ చేయనున్నారు. అభిషేక్ శర్మ స్థానంలో టీమ్ మేనేజ్‌మెంట్ రింకూ సింగ్‌కు ప్లేయింగ్ 11లో చోటు కల్పించవచ్చు.

బౌలింగ్ విభాగం ఇలా ఉండవచ్చు

స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి బాధ్యతలు పంచుకోనున్నారు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా మరియు అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ చేయనున్నారు. వీరికి తోడుగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే అదనపు బౌలింగ్ ఆప్షన్లుగా ఉండనున్నారు.

ఇంగ్లాండ్‌తో భారత్ జ‌ట్టు (అంచ‌నా)

  • సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
  Last Updated: 05 Mar 2026, 02:37 PM IST