Rohit Sharma: ప్రస్తుతం భారత్ పలు గ్లోబల్ ఐసీసీ (ICC) టోర్నమెంట్లలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. మహిళల ప్రపంచ కప్, పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ, పురుషుల టీ20 ప్రపంచ కప్, పురుషుల అండర్-19 ప్రపంచ కప్, మహిళల అండర్-19 ప్రపంచ కప్.. ఇలా అన్ని విభాగాల్లోనూ భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. దీనిపై స్పందించిన రోహిత్ శర్మ ఇది భారత జట్ల ప్రపంచ ఆధిపత్యంలో ఒక కొత్త శకానికి ఆరంభమని అభిప్రాయపడ్డారు. కాగా రోహిత్ ఇప్పుడు ఐపీఎల్ 19వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగనున్నారు.
‘భారత జట్టును చూసి గర్విస్తున్నాను’
ఒక కార్యక్రమంలో హిట్ మ్యాన్ మాట్లాడుతూ.. “గత కొన్నేళ్లుగా మనం చూస్తున్న ప్రదర్శనను చూసి నేను చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నాను. అద్భుతమైన ప్రదర్శన కనబర్చి మనం సాధించిన విజయాలు కేవలం పురుషుల జట్టు మాత్రమే కాదు.. మహిళల జట్టు కూడా ముంబైలో ప్రపంచ కప్ గెలవడం చూడటం చాలా అద్భుతంగా అనిపించింది” అని అన్నారు.
Also Read: ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!
‘ఇది కేవలం ఆరంభం మాత్రమే’
రోహిత్ ఇంకా మాట్లాడుతూ.. “ఇటీవల పురుషుల జట్టు సాధించిన విజయం అమోఘం. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని నేను ఆశిస్తున్నాను. ఇక్కడి నుండి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి మనకు ఆ మొమెంటం లభించినప్పుడు.. మనం తరచుగా మొమెంటం గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు పురుషుల, మహిళల జట్ల వద్ద ఆ ఊపు ఉంది. ఈ మొమెంటంను భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగిస్తామని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు.
#WATCH | Mumbai: Former Captain of the Indian Cricket Team, Rohit Sharma, says, "…I am very happy and proud to see what we have been witnessing for the last couple of years: to come out with flying colours and achieve what we have achieved. Not just the men's team, but also the… https://t.co/ZEMUbgLHBT pic.twitter.com/xNt8arqM6w
— ANI (@ANI) March 14, 2026
‘టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ముఖ్యం’
రోహిత్ శర్మ తన ప్రసంగంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. “అండర్-14 స్థాయి నుండి మీరు అదృష్టవంతులై ఉండాలి. ఖచ్చితంగా విజయం సాధించడానికి ప్రతిభ అవసరం. కానీ సరైన సమయంలో సరైన స్థానంలో ఉండటానికి అదృష్టం కూడా తోడవ్వాలి. అప్పుడే జనం మిమ్మల్ని గుర్తిస్తారు. కొన్నిసార్లు మీరు ఎంత టాలెంటెడ్ అయినా, జనం మిమ్మల్ని గమనించకపోతే మీరు దురదృష్టవంతులు కావచ్చు. అందుకే అదృష్టం కూడా ఉండాలి. అయితే కష్టపడి పనిచేయడానికి ఏదీ ప్రత్యామ్నాయం కాదు. ఇది కేవలం ముంబై ఆటగాళ్లకే కాదు, దేశానికి ప్రాతినిధ్యం వహించే ప్రతి క్రీడాకారుడికి వర్తిస్తుంది” అని రోహిత్ అన్నారు.
