Serena Williams: మనసు మార్చుకున్న​ స్టార్ టెన్నిస్​​ ప్లేయర్..!

అమెరికా స్టార్ టెన్నిస్​​ ప్లేయర్​ సెరెనా విలియమ్స్​.. మరోసారి రిటైర్మెంట్​ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.

  • Written By:
  • Publish Date - October 25, 2022 / 06:37 PM IST

అమెరికా స్టార్ టెన్నిస్​​ ప్లేయర్​ సెరెనా విలియమ్స్​.. మరోసారి రిటైర్మెంట్​ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘నేను రిటైర్​ అవ్వట్లేదు. తిరిగి కోర్టులోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు మా ఇంటికొస్తే అక్కడ ఉన్న ఓ కోర్టును కూడా చూడొచ్చు’’ అని ఓ మీడియా సమావేశంలో పేర్కొంది. సెరెనా విలియమ్స్ తాజా ప్రకటనతో మళ్లీ అభిమానుల్లో జోష్ నింపింది.

అసలు నేను రిటైర్మెంట్ గురించి పట్టించుకోలేదు. ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడుడూ ఎంత బిజిగా ఉండేదాన్నో ఇప్పుడూ అంతే బిజీగా ఉంటున్నాను. ఇప్పుడు నాతో నేనే టెన్నిస్ ఆడుకోవడం కొత్తగా, వింతగా అనిపిస్తుంది. నేను నా మునపటి ఫామ్ ను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నానని సెరెనా వివరించింది. టెన్నిస్ నా జీవితంలో చాలా పెద్ద భాగం. నేను పాల్గొనకుండా ఉండటాన్ని ఊహించలేను. అది (టెన్నిస్) లేని భవిష్యత్తును నేను చూడలేను అని విలియమ్స్ చెప్పింది.

23 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్ – 2022 నుంచి మూడో రౌండ్ లో నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ తాను గ్రౌండ్ లో అడుగుపెట్టడం ఖాయమని చెప్పింది. ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. రిటైర్మెంట్ వార్తలను కొట్టిపారేసింది. టెన్నిస్ ఆట నుంచి తనను ఎవరూ విడదీయలేరని పేర్కొంది. సెరెనా 23 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లను గెలుచుకుంది. ఓపెన్ ఎరాలో ఏ క్రీడాకారిణి చేయని అత్యధిక టైటిళ్లను సాధించింది. అంతేకాకుండా ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడటమంటే చాలా ఇష్టమని పేర్కొంది.