టీమిండియా కొంప‌ముంచిన ఆట‌గాళ్లు వీరేనా?!

గాయం నుంచి కోలుకున్న తర్వాత వాషింగ్టన్ సుందర్‌కు సూపర్-8 మొదటి మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించింది. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను కాదని టీమ్ మేనేజ్మెంట్ సుందర్‌పై నమ్మకంతో అవకాశం ఇచ్చింది.

Published By: HashtagU Telugu Desk
T20 World Cup

T20 World Cup

T20 World Cup: భారత క్రికెట్ జట్టు 2026 టీ20 వరల్డ్ కప్ నుండి నిష్క్రమించే దశకు చేరుకుంది. ప్రస్తుతం ఉన్న సమీకరణాల ప్రకారం.. టీమిండియా ఉన్న గ్రూప్ నుండి వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయని విశ్లేషణలు మొదలయ్యాయి. పాయింట్ల పట్టికలో భారత్ కంటే వెస్టిండీస్, దక్షిణాఫ్రికా అత్యంత పటిష్టమైన స్థితిలో ఉన్నాయి. అయితే టీమిండియాను ఈ దుస్థితికి చేర్చిన ప్రధాన ఆటగాళ్ల ప్రదర్శనపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. వారిలో ముఖ్యంగా ఈ ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి.

అభిషేక్ శర్మ

టీమిండియా ఈ పరిస్థితికి రావడంలో ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యం ప్రధాన పాత్ర పోషించింది. జట్టుకు సరైన ఆరంభం లభించనప్పుడు మిగిలిన బ్యాటర్లలో భారీ స్కోరు సాధించగలమనే నమ్మకం ఎలా వస్తుంది? ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో అభిషేక్ కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో వరుసగా మూడుసార్లు ‘సున్నా’ (డక్ అవుట్)కే అవుట్ అవ్వడం గమనార్హం. జట్టుకు శుభారంభం అందించడంలో అతను ఘోరంగా విఫలమయ్యాడు.

Also Read: ముంబై దాడుల నిందితుడు తహవ్వుర్ రాణాకు షాక్.. పౌరసత్వం రద్దు చేయనున్న కెనడా!

తిలక్ వర్మ

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో 69 పరుగుల పోరాట పటిమతో కూడిన ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించిన తిలక్ వర్మ ఈ వరల్డ్ కప్‌లో ఆ మ్యాజిక్‌ను పునరావృతం చేయలేకపోయాడు. 2026 టీ20 వరల్డ్ కప్‌లో అతని స్ట్రైక్ రేట్ కేవలం 119గా ఉంది. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 107 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక్క అర్ధసెంచరీ కూడా లేదు. అభిషేక్ విఫలమవుతున్న సమయంలో తిలక్ బాధ్యత తీసుకోవాల్సి ఉంది. కానీ అతను ఆ పాత్రలో పూర్తిగా విఫలమయ్యాడు. ఈ వరల్డ్ కప్‌లో తిలక్ సగటు కేవలం 21.40 మాత్రమే.

వాషింగ్టన్ సుందర్

గాయం నుంచి కోలుకున్న తర్వాత వాషింగ్టన్ సుందర్‌కు సూపర్-8 మొదటి మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించింది. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను కాదని టీమ్ మేనేజ్మెంట్ సుందర్‌పై నమ్మకంతో అవకాశం ఇచ్చింది. కానీ అతను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. నంబర్-5 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. అటు బౌలింగ్‌లోనూ కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయి జట్టుకు భారంగా మారాడు.

  Last Updated: 24 Feb 2026, 08:06 PM IST