Pat Cummins సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బిగ్ అప్‌డేట్ అందింది. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎప్పుడు టీమ్‌లోకి వచ్చే విషయాన్ని కోచ్ డేనియల్ వెటోరీ తెలిపాడు. గాయం కారణంగా చాలా కాలం పాటు క్రికెట్‌కు దూరమైన కమిన్స్.. ప్రస్తుతానికి ఫిట్‌గానే ఉన్నప్పటికీ, బౌలింగ్ లోడ్స్ పెంచే విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా ఫిట్‌నెస్‌కు సంబంధించి ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదని, మరో పది నుంచి 12 రోజుల్లో జట్టుతో జాయిన్ అయ్యే అవకాశం ఉందని వెటోరీ చెప్పాడు.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆరంభ మ్యాచ్‌కి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కోచ్ డేనియల్ వెటోరీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫిట్‌నెస్‌పై క్లారిటీ ఇచ్చాడు. కమిన్స్ ఐపీఎల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది, క్రికెట్ ఆస్ట్రేలియా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చిందా లేదా అన్న వివరాలు వెల్లడించాడు.
కమిన్స్ ఫిట్‌నెస్ బాగానే ఉన్నప్పటికీ, బౌలింగ్‌లో ఫిట్ అవ్వడానికి ఇంకాస్త సమయం పడుతుందని వెటోరీ తెలిపాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఇప్పటి వరకు కమిన్స్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడనే క్లియరెన్స్ మాత్రం రాలేదు. వెటోరీ అంచనా ప్రకారం మరో 10 నుంచి 12 రోజుల్లో కమిన్స్ కమ్ బ్యాక్ ఇస్తాడని అర్థమవుతోంది.
కమిన్స్ ఫిట్‌నెస్ విషయంలో పెద్దగా సమస్య లేదు. చాలా కాలం ఆటకు దూరంగా ఉండటం వల్ల స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్స్‌పై ఎక్కువగా పని చేశాడు. ఇక్కడ అసలు సవాలు బౌలింగ్ లోడ్స్‌ను పెంచడంలోనే ఉంది. తిరిగి బౌలింగ్ లోడ్స్‌ను పెంచడం చాలా కష్టమైన ప్రక్రియ. శరీరం పూర్తిగా ఫిట్ అవ్వడానికి ఇంకాస్త సమయం పడుతుంది అని వెటోరీ చెప్పాడు.
కమిన్స్ దూరమవ్వడంతో ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ అప్పగించామని.. సారథ్య బాధ్యతలు తీసుకోవడంలో ఇషాన్ చాలా ఎగ్జయిట్‌గా ఉన్నాడని వెటోరీ తెలిపాడు. ఇషాన్ కిషన్‌పై నమ్మకం ఉందని.. అదేవిధంగా కమిన్స్ లేకపోయినా జట్టులో అందుకు తగ్గ రీప్లేస్‌మెంట్‌లు ఉన్నాయంటూ వెటోరీ వివరించాడు. కమిన్స్ గ్రౌండ్‌లోకి రాకపోయినా.. ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తాడని క్లారిటీ ఇచ్చాడు.
ఇక ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. కమిన్స్ లేకపోయినా మ్యాచ్ గెలిచి జట్టులో కాన్ఫిడెన్స్ నింపాలని కెప్టెన్ ఇషాన్‌తో పాటు కోచ్ వెటోరీ గట్టి పట్టుదలతో ఉన్నారు.
