Gavaskar Blasted:గవాస్కర్ పై రాజస్థాన్ ఫాన్స్ ఫైర్

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు.

  • Written By:
  • Publish Date - May 21, 2022 / 12:05 PM IST

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్విధ్వంసక వీరుడు వెస్టిండీస్ ఆటగాడు శిమ్రాన్ హెట్‌మెయర్ బ్యాటింగ్‌కి వచ్చిన సమయంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న గవాస్కర్.. నోరుజారాడు. దాంతో.. నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయానికి చివరి 5 ఓవర్లలో 47 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన శిమ్రాన్ హెట్‌మెయర్ ను ఉద్దేశించి సునీల్ గవాస్కర్…. షిమ్రాన్ హెట్మేయర్ భార్య డెలివరీ అయ్యింది, అతను ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కోసం డెలివరీ చేస్తాడా” అని అభ్యంతరకరంగా మాట్లాడాడు.

దాంతో.. గవాస్కర్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయని వెంటనే వాటిని కామెంట్రీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు… ఈ మ్యాచ్‌లో 7 బంతులాడిన హెట్‌మెయర్ 6 పరుగులే చేసి ఔటయ్యాడు. ఇక హెట్‌మైర్‌ భార్య ఇటీవలే మగ బిడ్డకు జన్మనివ్వడంతో జట్టు బయో-బబుల్‌ను వీడి హెట్‌మైర్‌ స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది సీజన్‌లో హెట్‌మైర్‌ అద్భతంగా రాణిస్తున్నాడు.ఇప్పటివరకు హెట్‌మైర్‌ 12 మ్యాచ్‌లాడి 297 పరుగులు సాధించాడు. ఫినిషర్‌గా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ ఇప్పటి వరకు 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఈ సీజన్ పాయింట్ల పట్టికలో శాంసన్ సేన రెండో స్ధానానికి ఎగబాకింది. ఈమ్యాచ్ లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. చెన్నై జట్టులో మొయిన్‌ అలీ 93 పరుగులతో రాణించాడు. అనంతరం 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయి చేధించింది.