రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

శిఖర్ ధావన్ భారత్ తరపున తన చివరి మ్యాచ్‌ను 2022లో ఆడారు. ఆ తర్వాత టీమ్ ఇండియాలో చోటు దక్కకపోవడంతో ఆయన రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Shikhar Dhawan Marries Sophie

Shikhar Dhawan Marries Sophie

Shikhar Dhawan Marries Sophie: భారత్- శ్రీలంక వేదికలుగా టీ-20 వరల్డ్ కప్ 2026 జరుగుతున్న తరుణంలో భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ రెండో వివాహం చేసుకున్నారు. ధావన్ తన చిరకాల స్నేహితురాలు సోఫీ షైన్‌ను పెళ్లాడారు. దీనికి ముందు జనవరి 12న ధావన్- సోఫీ నిశ్చితార్థం చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

టీ-20 వరల్డ్ కప్ 2026 మధ్యలో స్టార్ ప్లేయర్ వివాహం

శిఖర్ ధావన్, అతని మొదటి భార్య అయేషా ముఖర్జీ అక్టోబర్ 2023లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ తమ 11 ఏళ్ల బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు. విడాకుల తర్వాత అయేషా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. వీరి వివాహం 2011లో జరిగింది. విడాకుల అనంతరం ధావన్ సోఫీ షైన్‌తో ప్రేమలో పడ్డారు. గత కొన్ని ఏళ్లుగా వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.

Also Read: గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

సోఫీ షైన్ ఎవరు?

సోఫీ షైన్ ఐర్లాండ్‌కు చెందినవారు. ఆమె వృత్తిరీత్యా ప్రొడక్ట్ కన్సల్టెంట్. ఆమె లైమరిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాజిల్‌రాయ్ కాలేజ్ నుండి మార్కెటింగ్, మేనేజ్‌మెంట్‌లో విద్యనభ్యసించారు. సోఫీ గతంలో నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో సెకండ్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. కొద్దిరోజుల క్రితమే సోఫీ, శిఖర్ ధావన్‌తో కలిసి ఉన్న హల్దీ వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

శిఖర్ ధావన్ క్రికెట్ కెరీర్

ధావన్ ఆగస్టు 2024లో అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. భారత్ తరపున అతని గణాంకాలు ఇలా ఉన్నాయి.

టెస్ట్ మ్యాచ్‌లు: 34 మ్యాచ్‌లలో 40.61 సగటుతో 2315 పరుగులు.

వన్డే మ్యాచ్‌లు: 167 మ్యాచ్‌లలో 6793 పరుగులు.

టీ-20 మ్యాచ్‌లు: 68 మ్యాచ్‌లలో 1759 పరుగులు.

శిఖర్ ధావన్ భారత్ తరపున తన చివరి మ్యాచ్‌ను 2022లో ఆడారు. ఆ తర్వాత టీమ్ ఇండియాలో చోటు దక్కకపోవడంతో ఆయన రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారు.

  Last Updated: 21 Feb 2026, 09:55 PM IST