ఐపీఎల్ 2026లో ధోనీ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా ధోనీ మాత్రం జట్టులోకి రావడం లేదు. ధోనీని గ్రౌండ్‌లో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబై ఇండియన్స్‌తో చెపాక్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌లో ధోనీ ఎంట్రీ ఇస్తాడని అభిమానులు అనుకుంటున్నారు. ఒకవేళ ధోనీ జట్టులోకి వస్తే చాలా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది.
సీఎస్కే మ్యాచ్ రోజు ఎంఎస్ ధోనీ ఎంట్రీ ఇస్తున్నాడా లేదా అనే విషయం రాత్రి 7 గంటల వరకు అభిమానులను టెన్షన్ పెడుతూనే ఉంటుంది. ఈ సీజన్ ఆరంభం నుంచి ధోనీ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూడటం, మ్యాచ్ టైమ్‌కి నిరాశ పడటం ఇదే జరుగుతుంది. అయితే, ముంబై ఇండియన్స్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో ధోనీ ఆడతాడని గట్టిగా వినిపిస్తుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఈ రోజు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించవచ్చు.
ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ధోనీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో జట్టులో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ధోనీ ప్లేయింగ్ 11లో ఉంటే కార్తీక్ శర్మను పక్కనబెట్టే అవకాశం ఉంది. లేకపోతే ధోనీనే ప్లేయింగ్ 11లో ఆడతాడు.
ధోనీ మార్పుతో పాటు ప్రశాంత్ వీర్ లేకపోతే అకేలా హోసెన్ ఇద్దరిలో ఒకరిని ఆడించే అవకాశం ఉంది. అకేలా హోసెన్ వాంఖడేలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రాణించడంతో అకేలా హోసెన్‌నే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా జట్టులో ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న స్పెన్సర్ జాన్సన్ కూడా ఈ మ్యాచ్‌లోనే ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ముకేశ్ చౌదరిని పక్కనబెడితే స్పెన్సర్ జాన్సన్‌తో బౌలింగ్ చేయించవచ్చు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్‌లు ఆడి కేవలం మూడు మాత్రమే గెలిచింది. మూడింటిలో ఒకటి ముంబై మీద ఉంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంచనా
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్, సర్ఫరాజ్ ఖాన్, డివాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ / ఎంఎస్ ధోనీ, జెమీ ఓవర్టన్, ప్రశాంత్ వీర్ / అకేలా హోసెన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సర్ జాన్సన్ / ముకేశ్ చౌదరి, గుర్‌జపనీత్ సింగ్.
