Blow To Gautam Gambhir : టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు షాక్ ఇచ్చే దిశగా బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన అధికారాలు, వసతులను కట్ చేసేందుకు బీసీసీఐ రెడీ అయినట్లు తెలిసింది. జట్టు ఎంపికతో పాటు సహాయక కోచ్‌లుగా తనకు ఇష్టమైన వారిని తీసుకొనేలా గంభీర్‌కు ఇచ్చిన స్వేచ్ఛపైనా పరిమితం విధిస్తారని సమాచారం. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓటమి నేపథ్యంలో అప్రమత్తమైన బీసీసీఐ గత శనివారం రోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. అందులోనే పలు సంచలన నిర్ణయాలను తీసుకుంది.
Also Read :100 Medals Returned : ప్యారిస్ ఒలింపిక్స్ ప్రమాణాలు పతనం.. 100 పతకాలు వాపస్.. ఎందుకు?
బీసీసీఐ కీలక నిర్ణయాలు..
- భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మేనేజర్ గౌరవ్ అరోరాకు(Blow To Gautam Gambhir) పలు వసతులను బీసీసీఐ కట్ చేయబోతోంది.
- ఇప్పటివరకు టీమిండియా మ్యాచ్‌లకు గౌరవ్ అరోరా హాజరైనప్పుడు.. టీమిండియా ఉండే హోటల్‌లోనే ఆయనకు వసతి కల్పించేవారు. ఇకపై అరోరాకు ఈ అవకాశాన్ని కల్పించరు.
- ఇప్పటివరకు మ్యాచ్ జరిగే స్టేడియంలోని వీఐపీ బాక్స్‌లో అరోరా కూర్చునేవారు. ఇకపై ఆయనకు ఆ అవకాశం ఇవ్వకపోవచ్చు.
- గౌతమ్ గంభీర్ సహాయక సిబ్బంది పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించనున్నారు. పనితీరు బాగుంటేనే వారిని కొనసాగిస్తారు.
- టీమిండియా సీనియర్ ప్లేయర్లు విదేశీ టూర్లకు వెళ్లే క్రమంలో భార్య, కుటుంబీకులను తీసుకెళ్లే సదుపాయం 2019 నుంచి అమలవుతోంది. దీన్ని రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ వంటి ప్లేయర్లు బాగానే వాడుకున్నారు.
- ఇక నుంచి విదేశీ టూర్లకు సీనియర్ ప్లేయర్లు వెళ్లేటప్పుడు.. వారి వెంట భార్య, కుటుంబసభ్యులు వెళ్లేందుకు అవకాశం ఇవ్వకపోవచ్చు. విదేశీ పర్యటన గరిష్ఠంగా 45 రోజులు ఉంటే.. అందులో రెండు వారాలు మాత్రమే ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులతో ఉండేలా నిబంధన తెస్తారని సమాచారం.
- విదేశీ పర్యటనల వేళ భార్య, కుటుంబీకులు వెంట వచ్చిన సమయాల్లో సీనియర్ ఆటగాళ్ల ఆటతీరు అంత బాగా లేదనే అభిప్రాయానికి బీసీసీఐ వచ్చింది.
- గత కొన్ని టోర్నమెంట్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆటతీరు దెబ్బతిందని బీసీసీఐ గుర్తించింది.
- టీమిండియా ఆటగాళ్లు తీసుకెళ్లే లగేజీ 150 కేజీలకు మించితే ఛార్జీలను వసూలను బీసీసీఐ భావిస్తోంది.