Bangladesh: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని డిమాండ్ చేసింది. అయితే ఐసీసీ ఆ డిమాండ్‌ను తిరస్కరించడమే కాకుండా, బంగ్లాదేశ్‌పై కఠిన చర్యలు తీసుకుంటూ వారిని టోర్నీ నుంచి తప్పించింది. ఈ పరిణామంతో బీసీసీఐ, బీసీబీ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
బీసీసీఐతో సత్సంబంధాల కోసం బీసీబీ ‘యూ-టర్న్’
దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం.. ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తన తప్పును తెలుసుకుని బీసీసీఐతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా బీసీసీఐకి ఒక లేఖ రాసింది. గతంలో ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన క్రికెట్ బంధాన్ని ఆ లేఖలో గుర్తు చేస్తూ టీమిండియా తమ దేశంలో పర్యటించి సిరీస్ ఆడాలని కోరింది.
Also Read: Cm Chandrababu Naidu: చరిత్ర నిన్ను క్షమించదు జగన్: చంద్రబాబు
ప్రభుత్వ నిర్ణయంపైనే బీసీసీఐ చూపు
ఈ లేఖపై బీసీసీఐ ఆచితూచి స్పందిస్తోంది. దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. “మాకు లేఖ అందింది నిజమే, కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తాం. ప్రభుత్వం నుంచి అనుమతి లభించకుండా మేము ఎటువంటి ముందడుగు వేయము” అని స్పష్టం చేశారు.
మళ్ళీ చిగురిస్తున్న ఆశలు
బంగ్లాదేశ్‌కు టెస్టు హోదా రావడంలో బీసీసీఐ కీలక పాత్ర పోషించింది. గత ప్రభుత్వం ఉన్న సమయంలో సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ ఇప్పుడు బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం రావడంతో భారత్‌తో మళ్ళీ క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించుకోవాలని బీసీబీ గట్టిగా ప్రయత్నిస్తోంది.
