Site icon HashtagU Telugu

Ind Vs Ban T20 World Cup: రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ.. ప్రేమ వర్షం కురిపించిన అనుష్క…!!

Virat

Virat

T20 ప్రపంచకప్ లో మరోసారి రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు విరాట్ కోహ్లీ. పాకిస్తాన్ పై చెలరేగిపోయిన కోహ్లీ…ఇప్పుడు బంగ్లాదేశ్ పై పరుగుల వర్షం కురిపించాడు. టీ20 వరల్డ్ కప్ లో భారత్ -బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 64పరుగులు చేశాడు. విరాట్ ఈ స్మోకిగ్ ఇన్నింగ్స్ చూసి ఆయన భార్య అనుష్క శర్మ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

అనుష్క తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో విరాట్ కోహ్లీ ఫొటోను షేర్ చేసింది. ఆ ఫోటోకు లవ్ ఏమోజీలను జోడించింది. విరాట్ అద్భుత బ్యాటింగ్ తోపాటు టీ20 వరల్డ్ కప్ లో భారీ రికార్డును బద్దలు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశాడు. దీంతో అటు అనుష్క…ఇటు క్రికెట్ అభిమానులు సంతోషంగా సంబురాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ ట్రెండింగ్ నడుస్తోంది.

అనుష్క స్పందిస్తూ…విరాట్ రికార్డులు బద్దలు కొట్టడం ఇదే తొలిసారి కాదు. నా భర్త వచ్చిన అవకాశాన్ని ఏదీ వదిలిపెట్టడు. భారత్ పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత అనుష్క తన భావోద్వేగంతో కూడిన పోస్టును షేర్ చేశారు.

Exit mobile version