Ajinkya Rahane: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఈ సీజన్‌లో తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం పట్ల కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే సంతోషంగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా అతని పేరిట ఒక అవమానకరమైన రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్‌లో రహానే ఖాతా తెరవకుండానే (డకౌట్) నాన్డ్రే బర్గర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అతను కేవలం 2 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో కూడా రహానే పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు సున్నాకే అవుట్
ఈ సీజన్‌లో కేకేఆర్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న అజింక్యా రహానే ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అత్యధిక సార్లు సున్నా పరుగులకే అవుట్ అయిన బ్యాటర్‌గా నిలిచాడు. ఓపెనర్‌గా అతను ఇప్పటివరకు 13 సార్లు డకౌట్ అయ్యాడు. రహానే కంటే ముందు ఈ రికార్డు పార్థివ్ పటేల్ పేరిట ఉండేది. పార్థివ్ పటేల్ ఓపెనర్‌గా 11 సార్లు సున్నాకే అవుట్ అయ్యాడు.
Also Read: హోర్ముజ్ జలసంధి నుండి బయటపడిన భారత నౌక!
Golden Duck for Seifert & Two ball Duck for Rahane 🤯
– Jofra & Burger breathing fire. pic.twitter.com/8saZIAXtjq
— Johns. (@CricCrazyJohns) April 19, 2026
కేకేఆర్ ఓపెనింగ్ జోడీ వైఫల్యం
కోల్‌కతా ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ జట్టు ఓపెనర్లు మాత్రం నిరాశ పరుస్తూనే ఉన్నారు. సీజన్ ప్రారంభంలో ఫిన్ అలెన్ విఫలమవడంతో టిమ్ సీఫెర్ట్‌ను జట్టులోకి తీసుకున్నారు. కానీ అతను ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఇక రహానే విషయానికొస్తే.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌ల్లో 152 పరుగులు చేశాడు. అతని సగటు 25.33గా ఉంది. సీజన్ ప్రారంభంలో అద్భుతంగా రాణించిన రహానే గత కొన్ని మ్యాచ్‌లుగా ఫామ్ కోల్పోయి తడబడుతున్నాడు. కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే ఓపెనింగ్ జోడీ పుంజుకోవడం చాలా కీలకం.
ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అత్యధిక సార్లు డకౌట్ అయిన వారు
- అజింక్యా రహానే (13 సార్లు)
- పార్థివ్ పటేల్ (11 సార్లు)
- శిఖర్ ధావన్ (10 సార్లు)
- గౌతమ్ గంభీర్ (10 సార్లు)
- డేవిడ్ వార్నర్ (9 సార్లు)
