Rishabh Pant: భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. IPL 2025 మెగా వేలానికి ముందే పంత్ ఈ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. దీనికి ముందు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. పాంటింగ్ DCతో 7 సంవత్సరాలు అనుబంధం ఉంది. అయితే అతని నిష్క్రమణ తర్వాత జట్టు ప్రధాన కోచ్ పదవి ఖాళీ అయింది. ఈ పదవి కోసం పలువురి ఆటగాళ్ల పేర్లు తెరపైకి వచ్చాయి.
రిషబ్ పంత్.. రికీ పాంటింగ్ చాలా సన్నిహితంగా ఉంటారు. రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను విడిచిపెట్టడం వల్ల పంత్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌ను విడిచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పంత్ 2016 నుండి ఢిల్లీ జట్టుకు ఆడుతున్నాడు. శ్రేయాస్ అయ్యర్ గాయం తర్వాత 2021 సంవత్సరంలో కెప్టెన్సీని అందుకున్నాడు. అప్పటి నుంచి డీసీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పంత్ ఢిల్లీని విడిచి పెడితే మెగా వేలంలో అతని కోసం పలు జట్లు కోట్ల విలువైన వేలం వేసే అవకాశం ఉంటుంది.
Also Read: Gareth Southgate: ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ గారెత్ సౌత్ గేట్ రాజీనామా
రిషబ్ పంత్ నేతృత్వంలో ఢిల్లీ ప్రదర్శన
రిషబ్ పంత్ గత నాలుగేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో ఢిల్లీ ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్‌కు చేరుకుంది. 2021లో DC రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత మూడేళ్లలో ఒక్కసారి కూడా ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది. 2024 సీజన్‌లో ఢిల్లీ ఆరో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.
ఇకపోతే పంత్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇటీలవ అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి జట్టుకు కీలక సమయాల్లో విజయాన్ని అందించాడు. ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లో ఉన్న పంత్ జూలై 27 నుంచి శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.