Aishwarya Rai: ఐశ్వర్యారాయ్ తో పెళ్లి, పిల్లలు అంటూ రజాక్ కాంట్రవర్సీ కామెంట్స్

భారత్‌లో జరుగుతున్న ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టు 9 మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడి సెమీఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం బ్యాటింగ్ లో విఫలమవ్వడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Aishwarya Rai

Aishwarya Rai

Aishwarya Rai: భారత్‌లో జరుగుతున్న ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టు 9 మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడి సెమీఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం బ్యాటింగ్ లో విఫలమవ్వడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం బాబర్ కెప్టెన్సీపై కూడా అనుమానాలు లేవనెత్తుతున్నారు. త్వరలోనే పాక్ కెప్టెన్సీలో మార్పులు ఉండొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.

షోయబ్ మాలిక్, కమ్రాన్ అక్మల్ మరియు అబ్దుల్ రజాక్‌లతో సహా పలువురు పాకిస్తానీ మాజీ దిగ్గజాలు బాబర్ ఆజం కెప్టెన్సీని వదులుకుని అతని ఆటపై దృష్టి పెట్టాలని అన్నారు. కరాచీలో జరిగిన ఓ కార్యక్రమంలో రజాక్ మాట్లాడుతూ..క్రికెట్‌ను మెరుగుపర్చాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఏమాత్రం లేదు. అలాంటప్పుడు అనుకున్న ఫలితాలు ఎలా వస్తాయి? నేను ఐశ్వర్యారాయ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల అందమైన పిల్లలు పుడతారని అనుకుంటే అది ఎప్పటికీ జరగదు కదా. ఇది కూడా అంతే. బోర్డు సంకల్పం బలంగా ఉంటేనే మంచి ఫలితాలు సాధ్యం అవుతాయి అని రజాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈవెంట్‌కు హాజరైన షాహిద్ అఫ్రిది మరియు ఉమర్ గుల్ వంటి ఇతర అనుభవజ్ఞులు రజాక్ వ్యాఖ్యలను చూసి నవ్వుతూ చప్పట్లు కొట్టారు.దీంతో నెటిజన్స్ రజాక్ పై మండిపడుతున్నారు. చెత్త పోలిక అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు షాహిద్ అఫ్రిది మరియు ఉమర్ గుల్ ల పై ఫైర్ అవుతున్నారు.

Also Read: KTR : బిజెపి , కాంగ్రెస్ నేతలను గంగిరెద్దులోళ్లతో పోల్చిన కేటీఆర్

  Last Updated: 14 Nov 2023, 07:22 PM IST