IPL 2026: ఐపీఎల్ 2026 మార్చి 28 నుండి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభానికి ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అన్ని జట్లు తమ శిక్షణ శిబిరాలను (ట్రైనింగ్ క్యాంప్స్) ప్రారంభించాయి. రోహిత్ శర్మ ఇప్పటికే ముంబై ఇండియన్స్‌తో చేరగా విరాట్ కోహ్లీ కూడా బెంగళూరు చేరుకున్నారు. కోహ్లీ త్వరలోనే RCB ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. ఐపీఎల్ పట్ల అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం ఉన్నప్పటికీ ఆటగాళ్ల గాయాలు జట్ల టెన్షన్‌ను పెంచుతున్నాయి. గత సీజన్‌లో RCBని ఛాంపియన్‌గా నిలబెట్టిన స్టార్ బౌలర్ ఈసారి ఆడటంపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.
ఆటగాళ్ల గాయాలు – జట్లలో ఆందోళన
RCBకి ఒక చేదు వార్త వినిపిస్తోంది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయపడటంతో మొదటి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. ఆర్సీబీతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆడటంపై కూడా సందేహాలు నెలకొన్నాయి. వెన్ను గాయం కారణంగా గత కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉన్న కమిన్స్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావొచ్చు. ఇప్పటికే టీమిండియా స్టార్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కూడా KKR యాజమాన్యాన్ని కలవరపెడుతోంది.
Also Read: ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వైఎస్సార్సీపీ నేత రోజా
స్టార్ ఆటగాళ్ల రాక.. అభిమానుల్లో జోష్
ముంబై ఇండియన్స్ దిగ్గజం రోహిత్ శర్మ ఇప్పటికే జట్టుతో చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టగా, కింగ్ విరాట్ కోహ్లీ కూడా బెంగళూరు చేరుకున్నాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో ఎంఎస్ ధోనీ సందడి మొదలైంది. అయితే ఈ ఉత్సాహం మధ్య ఆటగాళ్ల గాయాలు ఫ్రాంచైజీలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా కీలకమైన విదేశీ బౌలర్లు దూరం కావడం జట్ల వ్యూహాలను దెబ్బతీస్తోంది.
