IPL Mega Auction: 2025 ఐపీఎల్ మెగా వేలంపై రకరకాల అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అందుకు తగ్గట్టే ఈ సారి వేలం రసవత్తరంగా సాగే పరిస్థితి కనిపిస్తుంది. ఐపీఎల్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి ఐపీఎల్ ట్రోఫీ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది. గత సీజన్లో తృటిలో టైటిల్ కోల్పోయిన ఆర్సీబీ ఈ సారి భారీ ప్రణాళికతో ఉంది. అందులో భాగంగా ఆల్ రౌండర్ ఆటగాళ్లని ఫోకస్ చేస్తుంది.
మెగా వేలంలో ఆర్సీబీ ముగ్గురు ఆల్ రౌండర్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ పంజాబ్ కింగ్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లివింగ్‌స్టోన్ బ్యాట్‌తో పాటు బంతితోనూ సత్తా చాటగలడు. . లివింగ్‌స్టోన్ గత సీజన్‌లో రాణించలేకపోయాడు. 7 ఇన్నింగ్స్‌లలో 22.20 సగటుతో 111 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లోనూ ఫ్లాప్ అయి 3 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో పంజాబ్ అతన్ని విడుదల చేయాలనుకుంటుంది. దీంతో లివింగ్‌స్టోన్ వేలానికి వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఆర్సీబీ ఈ ఆల్ రౌండర్‌ను దక్కించుకోవడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టే ఛాన్స్ లేదు. గ్లెన్ ఫిలిప్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడుతున్నాడు. కానీ గత సీజన్లో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. టీ20 క్రికెట్‌లో గ్లెన్ ఫిలిప్స్ అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తాడు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ బౌలింగ్ ద్వారా కూడా జట్టుకు సహకారం అందిస్తాడు. ఫిలిప్స్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్. ఫిలిప్స్ లాంటి ఆటగాడికి రైజర్స్ జట్టు ఆడేందుకు అవకాశం కల్పించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒకవేళ ఫిలిప్స్ వేలంలోకి వస్తే ఆర్సీబీ ఫిలిప్స్ ని వదులుకునే ప్రసక్తే ఉండదు.
అశుతోష్ శర్మ తన తొలి సీజన్ 2024లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నప్పుడు, అద్భుతమైన ప్రదర్శన చేసి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ముంబైతో జరిగిన ఓ మ్యాచ్ లో ఫోర్ల కంటే సిక్సర్లు కొట్టడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి 2 ఫోర్లు, 7 సిక్సులు బాదాడు. చివరకు బుమ్రాను సైతం అతడు వదల్లేదు. బుమ్రా బౌలింగ్‌లో స్వీప్ షాట్‌తో సిక్సర్ బాదిన అశుతోష్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. విశేషం ఏంటంటే ఈ యువ ప్లేయర్ని ముంబై కేవలం 20 లక్షలకే కొనుగోలు చేసింది. అయితే అశుతోష్ మాత్రం 20 కోట్ల ఆట అడగలిగే ప్రతిభ ఉన్న ప్లేయర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. 17 ఏళ్లఐపీఎల్ చరిత్రలో 8వ స్థానంలో ఆడుతూ ఒక సీజన్‌లో 100 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ ఆటగాడిగా అశుతోష్ నిలిచాడు. అశుతోష్ 11 మ్యాచ్‌లలో 167.26 స్ట్రైక్ రేట్‌తో 189 పరుగులు చేశాడు. అతని హైయెస్ట్ స్కోర్ 61. ఒకవేళ అతను వేలానికి వెళితే ఆర్సీబీ అతనిని దక్కించుకునే అవకాశం ఉంది.
Also Read: MLC Kavitha Live: 500 కార్లతో బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న కవిత