Site icon HashtagU Telugu

Flexi War : కడపలో వైసీపీ, జనసేన ఫ్లెక్సీల కలకలం

Flexi Janasena , Ycp Kadapa

Flexi Janasena , Ycp Kadapa

కడప ఆర్ట్స్ కాలేజీ (Kadapa Arts College) వద్ద ఏర్పాటు చేసిన వైసీపీ, జనసేన ఫ్లెక్సీలు (YCP -Janasena Flexi War) స్థానికంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఫ్లెక్సీలు రాజకీయంగా విభేదాలను రెట్టింపు చేసేలా ఉన్నాయి. అధికారం ఉన్నా లేకపోయినా, ఎవరు వెళ్లిపోయినా కార్యకర్తలంతా జగన్ వెంటే ఉంటామని ఆ పార్టీ వారు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇక మరో ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ 50 కాకుండా 21 సీట్లే తీసుకుని నష్టపోయారని జనసేన పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి. పవన్ను వదిలేసి టీడీపీ నేతలు దావోస్ వెళ్లారంటూ అందులో పేర్కొన్నారు. ఈ ప్లెక్సీల పై స్థానికంగా చర్చ మొదలైంది.

Rain Free In Cafe : ఈ కేఫ్‌లో వర్షం ఫ్రీ.. కాఫీని సిప్ చేయగానే జోరువాన

ఈ ఫ్లెక్సీల కారణంగా స్థానికంగా వైసీపీ మరియు జనసేన కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకవైపు వైసీపీ నేతలు తమ నాయకుడి పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేస్తుండగా, మరోవైపు జనసేన కార్యకర్తలు తమ నాయకుడిపై జరుగుతున్న విమర్శలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీల పరిణామం కడపలో రాజకీయ పరిస్థితులను మరింత వేడెక్కించే అవకాశం ఉంది. రెండుపార్టీల మధ్య చర్చలు కేవలం స్థానికంగా మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయికి చేరే అవకాశాలున్నాయి.