Site icon HashtagU Telugu

Remand : మరోసారి వల్లభనేని వంశీ రిమాండ్‌ పొడిగింపు

Vallabhaneni Vamsi remand extended once again

Vallabhaneni Vamsi remand extended once again

Remand: టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ సత్యవర్ధన్‌ను అపహరించి, బెదిరించిన కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. వంశీని వర్చువల్‌గా జడ్డి ఎదుట జైలు అధికారులు ప్రవేశపెట్టారు. ఈ నెల 25 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ.. విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

Read Also: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఆల్ రౌండ‌ర్‌?

ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్థన్ తరపు లాయర్ రెండు రోజులు సమయం కోరగా.. దాంతో బెయిల్ పిటిషన్ పై విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో వల్లభనేని వంశీ ఉంటున్న బ్యారక్ మార్చాలని దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ చేసింది న్యాయస్థానం. కానీ, ఇతర ఖైదీలు ఉంటున్న బ్యారక్ లోకి వంశీని మార్చడం కుదరదని జైలు అధికారులు కోర్టుకు వెల్లడించారు. భద్రతా కారణాలతో బ్యారక్ మార్చలేమన్నారు. ఇక, మెత్తటి దిండు, దుప్పటి కావాలని వంశీ కోరగా, అందుకు జైలు అధికారులు ఒప్పుకున్న విషయం విదితమే.

కాగా, వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్‌ను తాజాగా డిస్మిస్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వంశీని మరోసారి విచారణ చేసేందుకు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు. ఇక, విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. ఇక, వైసీపీ ప్రభుత్వం హయాంలో 2023లో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. అప్పట్లో ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వం ఈ కేసులను పట్టించుకోలేదు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసును రీఓపెన్ చేసింది. ఈ కేసులో ఏ71గా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కాకుండా కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు.

Read Also: Mauritius: మారిషస్‌ని ట్యాక్స్ హెవెన్ అని ఎందుకు అంటారు?