Girl Eating Hair: ఐదేళ్లుగా తల వెంట్రుకలు తింటున్న బాలిక.. చివరికి ఏం జరిగిందో తెలుసా?

సాధారణంగా మన చుట్టూ ఉన్న వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వింత అలవాటు ఉంటుంది. అయితే అది వారి మానసిక

Published By: HashtagU Telugu Desk
Girl Eating Hair

Girl Eating Hair

సాధారణంగా మన చుట్టూ ఉన్న వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వింత అలవాటు ఉంటుంది. అయితే అది వారి మానసిక పరిస్థితి లేదంటే తెలిసి తెలియనితనం అని చెప్పవచ్చు. అయితే కొందరికి చిన్నప్పటి నుంచి నోట్లో వేలు పెట్టుకోవడం అలవాటు ఉంటే మరికొందరికి గోర్లు తినే అలవాటు ఉంటుంది. ఇంకొందరు మట్టి ఇసుక లాంటిది తింటూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వింత చేష్టలు చేస్తూ ఉంటారు. కాగా ఒక అమ్మాయి తల వెంట్రుకలను తినడం అలవాటుగా చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.
ఉత్తర ప్రదేశ్ లో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది.

అయోధ్యలో 14 ఏళ్ల బాలిక వెంట్రుకలను తినడం అలవాటుగా చేసుకుంది. అలా క్రమంగా ఆ అమ్మాయి తల వెంట్రుకలను తింటూ వచ్చింది. అయితే ఆ అమ్మాయి తల వెంట్రుకలను తింటుంది అన్న విషయం ఆమె ఇంట్లో వారికి తెలియదట. ఇంట్లో వాళ్లకు తెలియకుండానే ఆ బాలిక ఐదేళ్ల నుంచి వెంట్రుకలను తింటూ వస్తోంది. ఒకరోజున ఆ బాలికకు విపరీతమైన కడుపునొప్పి రావడంతో వెంటనే ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ స్కాన్ చేసిన వైద్యులు ఒక్కసారిగా కంగుతిన్నారు.

బాలిక కడుపులో వెంట్రుకల ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అదే విషయం ఆ బాలిక కుటుంబ సభ్యులకు వైద్యులు తెలపడంతో వారు కూడా షాక్ అయ్యారు. వారి పాపకు ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా తిన్నప్పుడు వెంటనే వాంతులు అవ్వడం లాంటివి జరిగేది అనేవారు వైద్యులకు వెల్లడించారు. వైద్యులు అల్ట్రాసౌండ్ చేయగా, బాలిక కడుపులో వెంట్రుకలు పెద్ద కుప్పగా ఉండటాన్ని వారు గుర్తించారు. ఆ వెంట్రుకల కారణంగా, కడుపులో కణితి ఏర్పడిందని వారు తెలిపారు. అనంతరం ఆ బాలికకు ఆపరేషన్ చేసిన డాక్టర్స్ కడుపులో 1 కిలో వెంట్రుకల కట్టను బయటకు తీశారు. దానిని చూసిన కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

  Last Updated: 05 Dec 2022, 10:03 PM IST