Tragedy : నేటి సమాజంలో ఫేకులు ఎక్కువైపోయాయి. తినే తిండిలో నాణ్యత లేదు.. చేయించుకునే చికిత్సలోనూ నాణ్యత లేదు. అర్హతలు లేకున్నా వైద్యులుగా సమాజంలో చెలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు కొందరు. అలాంటి ఘటనే ఇది. తనకు తెలియని వైద్యం చేయడం కంటే.. తెలియదని.. వేరే వద్దకు రిఫర్ చేసినా ఓ చిన్నారి ప్రాణాలు బ్రతికి ఉండేవి. ఈ విషాదకర ఘటన ఉప్పల్‌లో చోటుచేసుకుంది. చిన్నారి హన్విక కంట్లో నలక పడటంతో ఆసుపత్రికి తీసుకెళ్తే, వైద్యం సమయంలో మృతి చెందింది. ఈ సంఘటన నగరాన్ని కుదిపేసింది. వివరాళ్లోకి వెళితే.. హన్విక కుటుంబం ఉప్పల్ లో నివసిస్తోంది. ఆడుకుంటున్న సమయంలో కంట్లో నలక పడటంతో హన్విక తల్లిదండ్రులకు తెలిపింది. ఆమె బాధతో ఏడుస్తుండటంతో, తల్లిదండ్రులు ఆమెను మధ్యాహ్నం 12 గంటలకు ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్‌కు తీసుకెళ్లారు.
London Explosion: లండన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెలుపల భారీ పేలుడు!
హన్వికను పరిశీలించిన వైద్యులు సర్జరీ అవసరమని చెప్పారు. కంట్లో నలక పడితే సర్జరీ ఎందుకు అవసరమని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా, తగిన సమాధానం ఇవ్వలేకపోయారు. కానీ చిన్నారికి ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో వారు సర్జరీకి అంగీకరించారు. సర్జరీకి ముందుగా మత్తు ఇంజక్షన్ ఇవ్వగా, అదికూడా ఎక్కువ మోతాదులో ఉండడంతో హన్విక ప్రాణాలు కోల్పోయింది. హార్ట్ బీట్ ఆగిపోవడంతో అప్రమత్తమైన ఆనంద్ ఐ హాస్పిటల్ సిబ్బంది, హన్వికను ఎల్బీనగర్ రెయిన్ బో హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ విషయం హన్విక తల్లిదండ్రులకు తెలియజేయలేదు. కుటుంబ సభ్యులు రెయిన్ బో హాస్పిటల్‌కు వెళ్లి ఆరా తీశాక, పాప హన్విక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ వార్తతో హన్విక కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కంట్లో నలకతో వచ్చిన తమ పాపను, సర్జరీ చేయాలంటూ తీసుకెళ్లి, మృతదేహాన్ని అందజేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్విక మృతదేహాన్ని తీసుకుని ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ వద్ద ఆందోళన చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Vitamin D : సూర్యకాంతి ద్వారా విటమిన్ డి ఏ సమయంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది?