ఏపీ(AP)లో కూటమి అధికారంలోకి రావడం..వైసీపీ పార్టీ (YCP Party) దారుణంగా ఓడిపోవడం తో రాష్ట్ర ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఐదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన దారిద్రం..పీడ అంత పోయిందని ..ఇక రాష్ట్రానికి అన్ని మంచి రోజులే అని అంత భావిస్తున్నారు. ఇక మందుబాబుల సంబరాలు అంత ఇంత కాదు. ఐదేళ్లుగా తృప్తిగా రాష్ట్రంలో మందు తాగిన రోజులు లేవని బాధపడుతూ వచ్చారు. నాసిరకం మద్యంతో జగన్ ప్రాణాలు తీసాడని..ఎంతోమంది అనేక రోగాల బారినపడ్డారని ..ఈ మందు తాగలేక తెలంగాణ కు వెళ్లి మద్యం తెచ్చుకునే వాళ్లమని ఇక ఇప్పుడు మాకు మంచి రోజులు వచ్చాయని..బాబు వచ్చాడు మాకు మంచి మద్యం దొరుకుతుందని వారంతా సంబరపడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
గత ఎన్నికల్లో రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన జగన్..ఆ హామీని పక్కన పెట్టి సొంతంగా మద్యాన్ని దింపాడు. వైసీపీ పార్టీ కి చెందిన నేతలే మద్యాన్ని తయారుచేసి అమ్మకాలు జరిపారు. పక్క రాష్ట్రాల బ్రాండ్స్ కాకుండా ఊరు పేరు తెలియని మద్యాన్ని తీసుకొచ్చి అమ్మడం చేసారు. ఆ మందు తాగలేక..మద్యం తాగకుండా ఉండలేక మందుబాబులు నరకయాతన అనుభవించారు. అంతే కాకుండా విపరీతమైన ధరలకు నాసిరకం మద్యాన్ని అమ్మి వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారు. ఈ మద్యం పట్ల పలువురు సినీ ప్రముఖులు కూడా సెటైర్లు వేసిన దాఖలు ఉన్నాయి. ఇక కూటమి సైతం ఎన్నికల ప్రచారంలో మద్యం ఫై క్లారిటీ ఇచ్చారు. మద్యపానం చేయమని, కానీ మంచి నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని తెలిపారు. ఇక ఇప్పుడు ప్రచారంలో తెలిపినట్లే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
వేలం పాట నిర్వహించిన మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కొత్త ప్రభుత్వం ఆలోచన చేస్తుందట. ఇలా చేయడం వల్ల ఆదాయం కూడా భారీగా పెరిగే అవకాశముంది. ఇందుకు సంబంధించిన కసరత్తులు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు. మద్యం షాప్స్ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాకుండా మద్యం ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని , అలాగే కావాల్సిన బ్రాండ్స్ లభిస్తాయని మందు బాబులు భావిస్తున్నారు.
Read Also : Kangana Vs Kulwinder : కంగనకు హృతిక్, ఆలియా సపోర్ట్.. ఎందుకంటే ?