Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐఎమ్‌డీ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్ శనివారం వరకు అమల్లో ఉండనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌తో […]

Published By: HashtagU Telugu Desk
IMD Alert

IMD Alert

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐఎమ్‌డీ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్ శనివారం వరకు అమల్లో ఉండనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో రాత్రి వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశ్లేష‌కులు వెల్లడించారు. నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల్, యాదాద్రి-భువనగిరి, సూర్యాపేట, జనగాం, ఖమ్మం, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాల సూచనలు ఉన్నాయని తెలిపారు.

హైదరాబాద్ నగరంలో కూడా జూన్ 24 వరకు ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) గణాంకాల ప్రకారం.. శుక్రవారం నల్గొండ జిల్లాలో అత్యధికంగా 74.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో మారేడ్‌పల్లిలో అత్యధికంగా 14 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే రోజుల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు తమ ప్రయాణాలు, ఇతర కార్యక్రమాలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు.

  Last Updated: 21 Jun 2026, 11:03 AM IST