Site icon HashtagU Telugu

Telangana: సీఎం కేసీఆర్ ని కలిసిన మంత్రి కొప్పుల

Telangana

New Web Story Copy (29)

Telangana: మైనార్టీలకు వంద శాతం సబ్సిడీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకం అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

కొప్పుల ఈశ్వర్ తో పాటు మస్లిం, క్రిస్టియన్, మైనారిటీ మతాల నేతలు పాల్గొన్నారు. వారిలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్, దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి, తెలంగాణ మైనార్టీ నాయకులు బి. శంకర్ లూక్, ముస్సేన్ మదాని, నియమతుల్లా తదితరులు పాల్గొన్నారు.

Also Read: 1 Killed : హైద‌రాబాద్‌లో డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ఒక‌రు మృతి