TGPSC Group 1 Results : తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ప్రొవిజినల్ మార్కులను టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆ సోమవారం విడుదల చేశారు. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ లో అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో మార్కులు తెలుసుకోవచ్చు. మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ నిర్వహించిన అనంతరం 1:2 నిష్పత్తిలో తరువాత జాబితా వెల్లడిస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవాలని సూచించారు.
Read Also: TDP : నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు
గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో 67.17శాతం హాజరు నమోదైందని టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో మొత్తం ఏడు పేపర్లకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అక్టోబర్ 21 నుంచి నిర్వహించిన పరీక్షలు అక్టోబర్ 27తో ముగిశాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థులకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 46 పరీక్ష కేంద్రాల్లో ప్రధాన పరీక్షలు రాశారు. మొత్తం 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మొత్తం 31,403 మంది అర్హత సాధించారు. వీరిలో హైకోర్టు అనుమతితో పరీక్షలకు హాజరైన 20 మంది స్పోర్ట్స్ క్యాటగిరీ అభ్యర్థులు కూడా ఉన్నారు.
గ్రూప్-1 ఆరు పేపర్లలో వచ్చిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు సబ్జెక్టుల వారీగా స్కోర్ చేసిన మార్కులను అభ్యర్థుల హాల్ టికెట్, డేటాఫ్ బర్త్ వంటి వ్యక్తిగత లాగిన్‌లో పొందుపరిచింది. మార్చి 11న గ్రూప్ 2 ఫలితాలు విడుదల కానున్నాయి. మార్చి 20లోపు అన్ని పరీక్షల ఫలితాలు విడులకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది వరకు పోటీ పడుతున్నారు. రిజర్వేషన్ ప్రకారం చూస్తే వ్యత్యాసం కనిపిస్తుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒక్కో ఎగ్జామ్ ఫలితాలను వరుసగా విడుదల చేసి, నిరుద్యోగుల కలను సాకారం చేస్తామని చెప్పింది. చెప్పినట్లుగానే సోమవారం నాడు గ్రూప్ 1 ఫలితాలు వెల్లడయ్యాయి. ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది వరకు పోటీ పడుతున్నారు.
Read Also: Pink Tiolets In Rajamahendravaram : మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు…వసతులు చూస్తే షాకే!