Site icon HashtagU Telugu

Tata-Isro : గగన్ యాన్ కోసం టాటా ఎలిక్సీ వెహికల్.. ఏమిటి ?

Tata Isro

Tata Isro

Tata-Isro : టాటా గ్రూప్ ఆకాశాన్ని దాటేసి.. అంతరిక్షం హద్దుగా దూసుకుపోతోంది. 

ఇప్పటికే ఎయిర్ ఇండియా ద్వారా విమాన సేవల రంగంలో ఉన్న టాటా గ్రూప్ ఇప్పుడు ఇస్రోకు సపోర్ట్ గా నిలిచేందుకు రెడీ అయింది. 

2024లో ఇండియా నిర్వహించనున్న గగన్‌యాన్ మిషన్ కోసం ఒక కీలకమైన ప్రోడక్ట్ ను రెడీ చేసి ఇవ్వనుంది.

గగన్‌యాన్ మిషన్ కు సంబంధించిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) రికవరీ టీమ్‌కి శిక్షణ ఇవ్వడానికి క్రూ మాడ్యూల్ రికవరీ మోడల్స్ (CMRM)ని టాటా ఎలిక్సీ  (Tata Elxsi) అభివృద్ధి చేసింది. ఇప్పటికే రెండు క్రూ మాడ్యూల్ రికవరీ మోడల్స్ ను కేరళలోని కొచ్చి, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నంలలో ఉన్న నౌకాదళ శిక్షణా బృందాలకు టాటా ఎలిక్సీ అందించింది.  2024లో గగన్‌యాన్ మిషన్ లో భాగంగా అంతరిక్షానికి పంపించే వ్యోమగాములను తిరిగి సురక్షితంగా భూమికి తీసుకొచ్చే ల్యాండింగ్ ప్రక్రియను ఇస్రో(Tata-Isro) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

Also read : ISRo Gaganyaan: “గగన్ యాన్” వ్యోమగాములకు ట్రైనింగ్ ఇచ్చేందుకు సిమ్యులేటర్!

భూమికి 400 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో వ్యోమగాములు మూడు రోజుల పాటు గడిపిన తర్వాత వారిని భూమికి తీసుకొస్తారు. ఈక్రమంలో సముద్ర జలాల్లో ల్యాండింగ్ ఉంటుంది. ఈక్రమంలో వ్యోమగాముల ల్యాండింగ్ కు సాయం అందించడానికి కేరళలోని కొచ్చి, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నంలలో ఉన్న నౌకాదళంలో కొంతమందికి ఇస్రో ట్రైనింగ్ ఇస్తోంది. వ్యోమగాములు పారాచూట్ల సాయంతో సముద్ర జలాల్లో నిర్దిష్ట ప్రదేశంలో ల్యాండ్ కాగానే..  టాటా ఎలిక్సీకి చెందిన క్రూ మాడ్యూల్ రికవరీ మోడల్స్ (CMRM)లో నౌకాదళ సిబ్బంది వేగంగా వెళ్లి వారిని పికప్ చేసుకుంటారు. అంతరిక్ష వాతావరణం నుంచి భూమి వాతావరణంలోకి  రాగానే వ్యోమగాములకు   అందించాల్సిన ప్రాథమిక చికిత్సకు అవసరమైన ఏర్పాట్లన్నీ CMRMలో ఉంటాయి.

Exit mobile version