Site icon HashtagU Telugu

Monkeypox : క‌ర్ణాట‌క‌లో మంకీపాక్స్ అనుమానిత కేసు..?

monkeypox

monkeypox

క‌ర్ణాట‌క‌లో మంకీపాక్స్ అనుమానిత కేసు బ‌య‌ట‌ప‌డింది.. మంకీపాక్స్ లక్షణాలతో ఉన్న ఇథియోపియన్ జాతీయుడు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన‌ట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ తెలిపింది.వ్యాధి నిర్ధారణ కోసం అతని నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు ఆరోగ్య అధికారులు శనివారం తెలిపారు. ఆఫ్రికన్ జాతీయుడు ఆసుపత్రిలో ఒంటరిగా ఉన్నాడు. అతనికి మూత్రపిండ సమస్యతో సహా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో చికిత్స పొందుతున్న‌ట్లు స‌మాచారం. కిడ్నీ సంబంధిత వ్యాధి మరియు ఇతర అనారోగ్య స‌మస్యలతో 55 ఏళ్ల ఇథియోపియన్ జూలై మొదటి వారంలో వచ్చాడ‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు తెలిపారు. అయితే ఇటీవ‌ల అతని శరీరంలో దద్దుర్లు వ‌చ్చిన‌ట్లు ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. ఇది ప్రాణాంతక వ్యాధి కాదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్‌ తెలిపారు.