HYD : బెల్ట్ షాపులపై ఉక్కుపాదం.. అర్థరాత్రి దాడుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

న‌గ‌రంలోని బెల్టుషాపుల‌పై ఎమ్మెల్యే అరెక‌పూడి గాంధీ ఉక్కుపాదం మోపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై ఆయ‌ప దాడులు నిర్వ‌హించారు. స్థానిక మహిళలు, కాలనీ వాసుల ఫిర్యాదుల మేరకు అర్థరాత్రి స్వయంగా అక్కడికి వెళ్లి బెల్ట్ షాప్ నిర్వాహకులను పట్టించి పోలీసులకు అప్పగించారు. గోకుల్ ప్లాట్స్ కాలనీలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ నకిలీ మద్యం విక్రయిస్తున్నారని, దీంతో ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని స్థానిక మహిళలు అరెకపూడి […]

Published By: HashtagU Telugu Desk
MLA AREKAPUDI GANDHI

MLA AREKAPUDI GANDHI

న‌గ‌రంలోని బెల్టుషాపుల‌పై ఎమ్మెల్యే అరెక‌పూడి గాంధీ ఉక్కుపాదం మోపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై ఆయ‌ప దాడులు నిర్వ‌హించారు. స్థానిక మహిళలు, కాలనీ వాసుల ఫిర్యాదుల మేరకు అర్థరాత్రి స్వయంగా అక్కడికి వెళ్లి బెల్ట్ షాప్ నిర్వాహకులను పట్టించి పోలీసులకు అప్పగించారు. గోకుల్ ప్లాట్స్ కాలనీలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ నకిలీ మద్యం విక్రయిస్తున్నారని, దీంతో ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని స్థానిక మహిళలు అరెకపూడి గాంధీ దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలో శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయని, గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే స్పందించిన అరెకపూడి గాంధీ అర్థరాత్రి స్వయంగా అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బెల్ట్ షాప్ నిర్వాహకులను గుర్తించి, ఎక్సైజ్ మరియు పోలీసు అధికారులకు సమాచారం అందించి, వారి సమక్షంలో నిర్వాహకులను అదుపులోకి తీసుకునేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. బెల్ట్ షాపుల ద్వారా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమస్యపై తక్షణ స్పందన చూపి చర్యలు తీసుకున్నందుకు స్థానిక మహిళలు, కాలనీ వాసులుఅరెకపూడి గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాలనీలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని వారు కోరారు.

  Last Updated: 02 Jun 2026, 08:02 AM IST