Suryakumar Yadav: టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శనివారం (మార్చి 14, 2026) అంతర్జాతీయ క్రికెట్‌లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో ఒక హృద్యమైన వీడియోను షేర్ చేశారు. ముంబైకి చెందిన ఈ బ్యాటర్ చివరిసారిగా 2026 టీ20 ప్రపంచకప్‌లో ఆడారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో సూర్యకుమార్ కెప్టెన్సీలో భారత్ న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి విశ్వవిజేతగా నిలిచింది.
ఈ జట్టుపైనే అరంగేట్రం
సూర్యకుమార్ తన టీ20ఐ అరంగేట్రం 2021లో అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చేశారు. ఆ మ్యాచ్‌లో ‘మెన్ ఇన్ బ్లూ’ 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు అప్పుడు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. క్రికెట్ ప్రపంచంలో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 35 ఏళ్ల ఆటగాడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.
Also Read: భారత్‌కు బిగ్ రిలీఫ్..హొర్ముజ్ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు
‘కల నిజమైంది’
ఈ పోస్ట్‌లో 2024, 2026 టీ20 ప్రపంచ కప్ విజయ క్షణాలతో పాటు మరికొన్ని క్లిప్‌లు ఉన్నాయి. ఆయన క్యాప్షన్‌లో ఇలా రాశారు. 5 ఏళ్ల క్రితం ఒక కల నిజమైంది. భారత జెర్సీని ధరించడం అనేది ఇప్పటికీ నేను మాటల్లో పూర్తిగా వర్ణించలేని అనుభూతి. జట్టు కోసం మనం సృష్టించబోయే మరిన్ని జ్ఞాపకాల కోసం ఎదురుచూస్తున్నాను అని పేర్కొన్నాడు.
5 years ago, a dream turned into reality. Wearing the India jersey is a feeling I can still never fully put into words 🇮🇳
Here’s to many more memories that we’re going to create, for team 🇮🇳 pic.twitter.com/qhis2f44tQ
— Surya Kumar Yadav (@surya_14kumar) March 14, 2026
రికార్డులను గమనిస్తే.. సూర్యకుమార్ ఇప్పటివరకు 113 టీ20ఐ (T20I) మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో 36.85 సగటు 162.94 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 3,272 పరుగులు చేశాడు. ఇందులో 25 అర్ధశతకాలు, 4 శతకాలు ఉన్నాయి. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 37 వన్డే (ODI) మ్యాచ్‌లు కూడా ఆడాడు. వీటిలో 35 ఇన్నింగ్స్‌లలో 25.76 సగటు, 105.02 స్ట్రైక్ రేట్‌తో 773 పరుగులు సాధించాడు. ఇందులో 4 అర్ధశతకాలు ఉన్నాయి. దీనికి తోడు సూర్యకుమార్ ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు. దానిలోని ఏకైక ఇన్నింగ్స్‌లో 8 పరుగులు చేశాడు.
