Site icon HashtagU Telugu

Viral news:నన్ను పాస్ చేయండి ప్లీజ్…లేదంటే మా నాన్న నాకు పెళ్లి చేస్తాడు…!!

answer sheet

answer sheet

పరీక్షల్లో కొందరు విద్యార్థులకు ఏం రాయాలో అర్థంకాక విచిత్రంగా ఏదోకటి రాస్తుంటారు. ఇలాంటి వాళ్ల పేపర్లు చూసిన టీచర్లు…పాస్ చేయలేకపోతారా అంటూ ధీమా వ్యక్తం చేస్తుంటారు. అయితే తమకు పాస్ మార్కులు వేయాలని కొందరు విద్యార్థులు జవాబు పత్రాల ద్వారా వేడుకుంటారు. మరికొంతమంది మంచి మార్కులు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామాని బెదిరిస్తుంటారు. తాజాగా హర్యానాలో జరుగుతున్న బోర్డు పరీక్షల్లో ఓ యువతి రాసిన మ్యాటర్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

ఎగ్జామ్ పేపర్ లో ఏం రాసిదంటే…తన తండ్రి బాగా తాగుతాడని…సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురువుతున్నారని..ఓ విద్యార్థిని జవాబు పత్రంలో రాసింది. తనకు ఆర్మీలో ఉద్యోగం చేయాలని ఉన్నట్లు అందులో రాసింది. అయితే ఈ పరీక్షల్లో 75 శాతం మార్కులు రాకపోతే…తన తండ్రి పెళ్లి చేస్తానని చెప్పాడని రాసుకొచ్చింది. కూతురిలా భావించి తనను పాస్ చేయాలని కోరింది. దీంతో పరీక్ష పేపరు దిద్దే టీచరుకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయాన్ని అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ న్యూస్ వైరల్ అయ్యింది.

Exit mobile version