1 Killed : అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి

అమెరికాలో తెలంగాణ‌కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. ప్రమాదవశాత్తూ తన వద్ద ఉన్న తుపాకీ పేలడంతో మృతి

Published By: HashtagU Telugu Desk
Deaths

Deaths

అమెరికాలో తెలంగాణ‌కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. ప్రమాదవశాత్తూ తన వద్ద ఉన్న తుపాకీ పేలడంతో మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అలబామా రాష్ట్రంలోని ఆబర్న్‌లో సోమవారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) జరిగిన ఈ ఘటనలో ఖమ్మం జిల్లా మ‌ధిర‌కు చెందిన మహంకాళి అఖిల్ సాయి (25) ప్రాణాలు కోల్పోయారు. సాయి 13 నెలల క్రితం అమెరికా వెళ్లి ఆబర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. సాయి సమీపంలోని గ్యాస్ స్టేషన్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయితే అఖిల్ సాయి సెక్యూరిటీ గార్డు తుపాకీని తీసుకున్నాడని.. దానిని తన చేతుల్లో పట్టుకుని నిశితంగా పరిశీలిస్తుండగా, అది ప్రమాదవశాత్తూ పేలింది. దీంతో బుల్లెట్ అతని తలకు తగిలడంతో గాయాలైయ్యాయి. వెంట‌నే గ్యాస్ స్టేషన్ సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలని కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

  Last Updated: 07 Feb 2023, 06:51 PM IST