China: చైనాలో భారీ భూకంపం

చైనా దేశంలోని కింగ్‌ హై ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కింగ్‌హై ప్రావిన్స్‌లోని మెన్యువాన్‌ కౌంటీలో భూకంపం వచ్చిందని స్థానిక మీడియా తెలిపింది. భూకంప కేంద్రాన్ని 37.77 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 101.26 డిగ్రీల తూర్పు రేఖాంశంలో పరిశీలించారు. జిన్హువా న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. ఇవాళ తెల్లవారుజామున 1:45 గంటలకు (బీజింగ్ టైమ్) 10 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. ప్రావిన్షియల్ రాజధాని జినింగ్ […]

Published By: HashtagU Telugu Desk
Et

Et

చైనా దేశంలోని కింగ్‌ హై ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కింగ్‌హై ప్రావిన్స్‌లోని మెన్యువాన్‌ కౌంటీలో భూకంపం వచ్చిందని స్థానిక మీడియా తెలిపింది. భూకంప కేంద్రాన్ని 37.77 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 101.26 డిగ్రీల తూర్పు రేఖాంశంలో పరిశీలించారు. జిన్హువా న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. ఇవాళ తెల్లవారుజామున 1:45 గంటలకు (బీజింగ్ టైమ్) 10 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. ప్రావిన్షియల్ రాజధాని జినింగ్ సిటీలో బలమైన ప్రకంపనలు వచ్చాయి.

  Last Updated: 08 Jan 2022, 02:09 PM IST