Suicide: ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. ఎన్ని కోట్లు సంపాదించినా ఆరోగ్యం బాగాలేకపోతే ఏం లాభం. అందుకే అంటారు పెద్దలు ఆరోగ్యాన్ని మించిన ఆస్తి మరొకటి ఉండదని. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని పెడచెవిన పెడుతున్నారు. ఒక్కసారి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే సంపాదించిందంతా హాస్పిటల్ లో దారబోయాలి. విషయం ఏంటంటే.. కడుపు నొప్పి భరించలేక ఓ మహిళా తనువు చాలించింది. భరించలేని నొప్పితో బాధపడేకంటే మరణమే సుఖమని భావించింది ఆ మహిళా. దీంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలలోకి వెళితే.. మూడేళ్లుగా కడుపునొప్పి తట్టుకోలేక 55 ఏళ్ల మహిళ సెప్టెంబరు 3 ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ పి శ్యామ్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలం కృష్ణపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆమె భర్త హనుమంతు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు విచారిస్తున్నారు.
Also Read: Keema Pizza: రెస్టారెంట్ స్టైల్ కీమా పిజ్జా ఇంట్లోనే తయారు చేసుకోండిలా?