Site icon HashtagU Telugu

Shraddha Kapoor : శ్రద్దాకపూర్‌కు మరో జాక్‌పాట్‌..!

Shraddha Kapoor

Shraddha Kapoor

Shraddha Kapoor : శ్రద్ధా కపూర్‌ క్రేజ్ ఇటీవల “స్త్రీ 2” భారీ విజయంతో మరింత పెరిగింది. ఈ సినిమా ఆమెను మరింత పాపులర్ చేసింది. అభిమానులు ఆమె తదుపరి ప్రాజెక్టులు ఏంటి అనేదాని మీద ఉత్కంఠగా ఉన్నారు. అయితే, ఇప్పటివరకు ఆమె కొత్త సినిమాల గురించి ఇంతవరకు ఎలాంటి అప్డేట్‌ ఇవ్వలేదు. అయితే, చిత్రనిర్మాత నికిల్ ద్వివేది ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు, శ్రద్ధా కపూర్ త్వరలో “నాగిని” పేరుతో ఒక సినిమాలో కనిపించబోతుందట. కానీ, నికిల్ ఈ చిత్రంలో నటీనటుల జాబితా లేదా విడుదల తేదీపై ఇంకా ఎలాంటి సమాచారం ప్రకటించలేదు. ఆయన చెప్పిన ప్రకారం, చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ ప్రారంభం త్వరలోనే జరగనుంది. ఈ స్క్రిప్ట్‌ను తాను పలు మార్లు రైట్ చేయడంతో, ఇప్పుడు ఒక ప్రాథమిక స్క్రిప్ట్‌ను ఫైనలైజ్ చేశానని ఆయన వెల్లడించారు.

Old Vehicles : కాలం చెల్లిన వాహనాలు @ 42 లక్షలు.. వీటిలో టూవీలర్స్ 31 లక్షలు

నికిల్ ద్వివేది ఇంటర్వ్యూలో చెప్పినట్టు, శ్రద్ధా కపూర్ ఈ ప్రాజెక్ట్‌ గురించి చెప్పడంతోనే.. వెంటనే ఒప్పుకుంది, షూటింగ్ ప్రారంభించడానికి ఎంతగానో ఉత్సాహంగా ఉందని పేర్కొన్నారు. అయితే.. “నాగిని” అనే కాన్సెప్ట్ ప్రస్తుత కాలంలో టెలివిజన్‌ వరకు పరిమితమై ఉన్నది. ఈ కాన్సెప్ట్‌ను వెండి తెరపై తీసుకువెళ్ళడం ప్రస్తుతం పెద్ద పరికల్పనగా భావించబడుతుంది, ఎందుకంటే ఇది ఇప్పటికే పాత కావడం వల్ల నిర్మాతలకు పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. టీవీ ప్రేక్షకులు నాగిని సీరియల్స్‌ను ఎంతగానో ఆదరించారు. అయితే.. ఈ కాన్సెప్ట్‌తో సినిమాను ప్లాన్‌ చేయడం సహాసమనే చెప్పాలి.

అయితే, ఈ సినిమాను తగిన శైలిలో, మంచి విజువల్ ఎఫెక్ట్స్‌తో, అన్ని వయస్సుల ప్రేక్షకులకు ఆకర్షణీయంగా రూపొందిస్తే, మళ్లీ మంచి వసూళ్లు సాధించడంలో అవకాశాలు ఉండవచ్చు. కానీ, బాలీవుడ్‌ సృజనాత్మక రచయితలు, దర్శకుల విషయంలో కొద్దిగా లోటు పడిపోతున్న సంగతి తెలిసిందే. అటువంటి పరిస్థితుల్లో “నాగిని” సినిమా ప్లాన్ చేయడం సరైన నిర్ణయం కావొచ్చు అని సందేహాలున్నాయి. శ్రద్ధా కపూర్ తన స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవడం కోసం మరింత మంచి ప్రాజెక్టులను ఎంచుకోవాలని భావిస్తున్నారు. “నాగిని” చిత్రం గురించి ఇంకా మరిన్ని వివరాలు రాబోయే నెలల్లో వెలుగు చూడాలని ఆశిస్తున్నారు.

Rivers Inter Linking : గోదావరి – కృష్ణా – పెన్నా నదుల అనుసంధానం.. ఏపీకి ప్రయోజనమిదీ