Site icon HashtagU Telugu

Dehradun: బస్సులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

Punjab Minor Girl Rapped

Punjab Minor Girl Rapped

Dehradun: కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం మరియు హత్యపై దేశం మొత్తం ఇప్పటికే ఆగ్రహంతో ఉంది. మరోవైపు శనివారం డెహ్రాడూన్ లో మైనర్ బాలిక సామూహిక త్యాచారానికి గురైంది. ఇంటర్‌స్టేట్ బస్టాండ్ (ISBT) కాంప్లెక్స్‌లో ఆగి ఉన్న బస్సులో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు నమోదైంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు బాలికకు కౌన్సెలింగ్‌ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆగస్టు 12-13 అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. బాధితురాలు మానసికంగా అస్వస్థతకు గురైంది. బాధిత బాలిక పంజాబ్ వాసిగా చెప్తున్నారు. ఆమె పంజాబ్ నుంచి ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి మొరాదాబాద్ వెళ్ళింది. ఆ తర్వాత ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో ఆమె డెహ్రాడూన్ చేరుకున్నారు. పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ సింగ్ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఆయన ఆదేశాల మేరకు నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశారు.

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు ప్రీతి తప్లియాల్ మాట్లాడుతూ ఆగస్టు 13 సాయంత్రం ఇంటర్‌స్టేట్ బస్టాండ్ వెలుపల నిరుత్సాహ స్థితిలో ఉన్న ఒక టీనేజ్ బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ గమనించి రక్షించారని ఆమె తెలిపారు. బాలికను విచారిస్తున్న సమయంలో ఆమె ఏడుస్తూనే ఉంది. తనకు అఘాయిత్యం జరిగిందని చెప్పే ప్రయత్నం చేసిందని అయితే విషయం తీవ్రతను గమనించిన హెల్ప్‌లైన్ బృందం బాలికను బాలికా నికేతన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చింది. కౌన్సెలింగ్‌లో తాను పంజాబ్‌కు వాసినని, ముస్లిం అని బాలిక చెప్పింది. ఆమె వయస్సు దాదాపు 16 సంవత్సరాలు. తల్లిదండ్రులు చనిపోయారని బాలిక చెప్పింది. ఆమె తన సోదరితో నివసిస్తుంది. అక్కా, బావ ఆమెను ఆగస్టు 11న ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఆ తర్వాత ఆమె బస్సులో ఢిల్లీకి చేరుకుంది. అక్కడి నుంచి మరో బస్సులో మొరాదాబాద్ చేరుకుని ఆగస్టు 12వ తేదీ సాయంత్రం డెహ్రాడూన్ వెళ్తున్న బస్సు ఎక్కింది. రాత్రి 2.30 గంటలకు డెహ్రాడూన్ చేరుకున్న తర్వాత బస్సు ఇంటర్‌స్టేట్ బస్టాండ్ లోపలికి వెళ్లినప్పుడు, అందరూ దిగారు. తాను బస్సులో కూర్చున్నానని బాధితురాలు చెప్పింది. బస్సులో బహుశా డ్రైవర్ మరియు కండక్టర్ ఉన్నారు. ఆ సమయంలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది.

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు ప్రీతి తప్లియాల్ మాట్లాడుతూ.. కౌన్సెలింగ్‌లో రెడ్ కలర్ బస్సు గురించి బాధితురాలు ప్రస్తావించిందని తెలిపారు.సంఘటన జరిగిన బస్సు ఉత్తరప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కి చెందినదిగా ఉంటుందని దర్యాప్తు బృందం అంచనా వేస్తోంది. ఘటన జరిగిన రాత్రి ఏయే బస్సులు ఐఎస్‌బీటీలోకి ప్రవేశించాయో తెలుసుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Also Read: Duvvada Srinivas : మెట్టు దిగిన వాణి