Pranay Murder case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో ఏ1 మారుతీ రావు గతంలో ఆత్మహత్య చేసుకోగా, ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఈ కేసులో మిగతా నిందితులకు జీవిత ఖైదు విధించారు.
Read Also: Jagga Reddy : యాక్టర్‌గా జగ్గారెడ్డి.. ప్రేమ కథా చిత్రంలో కీలక పాత్ర
మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీస్ యంత్రాంగం.. విచారణ పూర్తి చేపట్టి ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జిషీటు దాఖలు చేశారు. సుమారు ఐదేళ్ల పైగా కోర్టులో విచారణ సాగగా.. ఇటీవలే వాదనలు ముగిశాయి. తాజాగా నల్గొండ కోర్టు తుది తీర్పు వెలువరించింది.
ప్రణయ్, అమృత 2018 జనవరిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో పోలీసులకు ఇరు కుటుంబాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ప్రణయ్‌తోనే ఉంటానని పోలీసుల సమక్షంలో అమృత తేల్చిచెప్పింది. 2018 సెప్టెంబర్ 14న అమృత వైద్యపరీక్షల కోసం భర్త ప్రణయ్, అత్త ప్రేమలతతో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా ప్రణయ్‌ను దుండగుడు కత్తితో నరికి హత్యచేశాడు. ఘటనాస్థలంలోనే ప్రణయ్ చనిపోయాడు.
ఇక, ప్రణయ్ హత్య కేసులో ఏ1 నిందితుడు మారుతీరావు 2020లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో ఏ2 సుభాష్‌కుమార్‌శర్మ, ఏ3 అస్గర్‌అలీ, ఏ4 బారీ, ఏ5 కరీం, ఏ6 శ్రవణ్‌కుమార్, ఏ7 శివ, ఏ8 నిజాంలు మిగిలిన నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్‌శర్మకు బెయిల్ రాకపోవడంతో జైలులోనే ఉండగా.. అస్గర్ అలీ వేరే కేసులో జైలులో ఉన్నారు. మిగిలిన వారందరూ బెయిల్‌పై బయటకు వచ్చారు.
Read Also: Anganwadis Protest : ఛలో విజయవాడకు అంగన్వాడీల పిలుపు..