Female Robot – Gaganyaan : భారతదేశపు తొలి మానవ అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’ మిషన్ కు సంబంధించి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. గగన్‌యాన్ మిషన్ రెండోదశ ట్రయల్ లో భాగంగా మహిళా రోబో ‘వ్యోమ మిత్ర’ను స్పేస్ లోకి పంపుతామని వెల్లడించారు. ఈ ఏడాది చివరినాటికి లేదా 2024 సంవత్సరం ఆరంభంలో గగన్‌యాన్ మిషన్ రెండోదశ ట్రయల్ ఉంటుందని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా గగన్‌యాన్ ప్రాజెక్ట్ ఆలస్యమైందని, అక్టోబర్ మొదటివారం లేదా రెండోవారంలో గగన్‌యాన్ మొదటి ట్రయల్ మిషన్‌ను ప్లాన్ చేస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. రెండో ట్రయల్ మిషన్ లో ఆడ రోబోట్ అంతరిక్షానికి వెళ్లి సేఫ్ గా భూమికి తిరిగొస్తే.. తాము మనుషులతో కూడిన అంతరిక్ష యాత్ర వైపుగా అడుగులు వేస్తామని వివరించారు.
Also read : Chappal Chor: చెప్పును దొంగిలించిన పాము.. నెటింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో!
‘గగన్‌యాన్ ట్రయల్ మిషన్ ల కోసం లాంచ్‌ప్యాడ్ ఆగ్మెంటేషన్ పనులు జరుగుతున్నాయి. ఆర్బిటల్ మాడ్యూల్ తయారీ సెంటర్ నిర్మాణం కూడా పూర్తయింది. టెస్ట్ వెహికల్ మిషన్ ఇంటిగ్రేషన్ పనులు ఇందులోనే జరుగుతాయి. అన్నీ సవ్యంగా జరిగితే.. 2024 లేదా 2025లో మనుషులతో గగన్ యాన్ ప్రయోగాన్ని నిర్వహిస్తాం’ అని జితేంద్ర సింగ్ తెలిపారు.గగన్ యాన్ మానవ సహిత మిషన్ విజయవంతమైతే.. అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ సక్సెస్ ను సాధించిన నాలుగో దేశంగా భారత్ ఘనతను సొంతం చేసుకుంటుందన్నారు.
Also read : KTR in US: తెలంగాణాలో కోకాకోలా భారీ పెట్టుబడులు
‘వ్యోమ మిత్ర’ విశేషాలు ఇవీ..
గగన్ యాన్ లో భాగం కానున్న మహిళా రోబో ‘వ్యోమ మిత్ర’ను (Female Robot – Gaganyaan) 2020 జనవరి 22న ఇస్రో లాంచ్ చేసింది. దాని వివరాలను ఆ రోజున అందరికీ వెల్లడించింది. అదొక హ్యూమనాయిడ్ రోబో. దానికి కాళ్లు ఉండవు. అయినప్పటికీ ముందుకు, పక్కకు వంగగలదు. ఇది మానవ శరీరం యొక్క చాలా విధులను అనుకరించగలదు. అది అంతరిక్షంలోకి వెళ్లాక.. మన కమాండ్స్ ప్రకారం పనిచేస్తుంది. ఈ రోబో మనుషులను గుర్తించగలదు. మన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదు. వ్యోమగాములతో సంభాషించగలదు.
Also read : YouTube Song Search : హమ్ చెయ్.. పాట వినెయ్.. యూట్యూబ్ అదిరిపోయే ఫీచర్ !
గగన్ యాన్ లో అంతరిక్షం నుంచి భూమికి ఇలా తిరిగొస్తారు..
ఇక గగన్ యాన్ మిషన్ లో పాల్గొననున్న వ్యోమగాముల శిక్షణ 2020 జనవరిలోనే రష్యాలో ప్రారంభమైంది. ఈ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసి 11 నెలలు శిక్షణ ఇచ్చారు. అయితే గగన్ యాన్ మానవ సహిత మిషన్ లో కేవలంముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళతారు. నిర్దేశిత కక్ష్యలో మూడు రోజుల పాటు ప్రయోగం అనంతరం తిరిగి భూమి మీదకు వస్తారు. ఇస్రోకి నమ్మకమైన LVM-3 వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం చేయనున్నారు. అయితే నిర్దేశిత సమయం (మూడు రోజుల ప్రయోగం తర్వాత) తిరిగి వ్యోమగాములను భూమికి తీసుకు రావడం అసలైన సవాల్.. ఇందుకోసం వాడే టెక్నాలజీని కూడా ఇస్రో రెడీ చేసింది. తిరిగి వచ్చే సమయంలో క్యాప్సూల్ మాడ్యూల్ ద్వారా భూమికి తిరిగి వస్తారు.. అంతరిక్షం నుంచి భూకక్ష్యలోకి వచ్చేప్పుడు దాని వేగం ఎక్కువగా ఉంటుంది.. అందుకే ఆ మాడ్యూల్ సముద్రంలో పడేలా చూస్తారు. అలా పడ్డాక దాన్ని రికవరీ చేసేందుకు ముందుగానే నావి, ఆర్మీ, ఇస్రో అధికారులు సిద్ధంగా ఉంటారు.. ఈ ప్రక్రియను 2023 జులైలోనే ఇస్రో పరీక్షించింది.