AP Free Sand : రాష్ట్ర ప్రభుత్వం ఇసుకపై శుభవార్త ప్రకటించింది. ఇసుక రీచ్‌ల నుండి ఇసుకను ట్రాక్టర్లలో తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ జీఎం ఎంస్ నంబర్ 64 కింద ఉత్తర్వులు జారీ చేసింది. పూర్వం, స్థానిక అవసరాల కోసం ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, ఇప్పుడు ట్రాక్టర్లకు కూడా అనుమతినిచ్చారు. ఈ ఉత్తర్వులను రాష్ట్ర గవర్నర్ పేరుతో రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో, స్థానిక అవసరాలకు మాత్రమే ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఇసుక కొరతను నివారించాలనే ఉద్దేశంతో, స్థానిక అవసరాల కోసం ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లేందుకు ప్రభుత్వానికి వీలు కల్పించారు. ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల ఇంటి నిర్మాణాలు ఆలస్యం కాకుండా చూడటానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ముఖ్య కార్యదర్శి మీనా తెలిపారు.
Amaravati : నేడు అమరావతి పనుల పునఃప్రారంభం
ఉత్తర్వుల్లో, స్థానిక అవసరాలకు సరిపోయే మోతాదులో ఇసుక రవాణాకు అనుమతించాలన్నది ప్రస్తావించారు. గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం రాకుండా, సమీప వాగుల నుండి ఉచితంగా ఇసుకను తీసుకెళ్లేలా, అవసరమైనవారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లను ఉపయోగించుకోవచ్చని కూడా వివరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఇసుక విధానాలను (కొత్త ఇసుక మైనింగ్ విధానం 2019, అప్‌గ్రేడ్ చేసిన ఇసుక విధానం 2021) ఉపసంహరించారని పేర్కొన్నారు. ఇసుక మైనింగ్ పాలసీని రూపొందించే వరకు, వినియోగదారులకు ఇసుక సరఫరా చేయడానికి ప్రభుత్వం మధ్యంతర పద్ధతులను జులై 8, 2024న ప్రవేశపెట్టిందని ఉత్తర్వులు స్పష్టం చేశాయి.
వ్యక్తిగత ఉపయోగం లేదా కమ్యూనిటీ పనుల కోసం గ్రామ పంచాయితీలలోని కాలువలు, నదుల నుంచి ఇసుక , సాధారణ మట్టిని సంప్రదాయ పద్ధతిలో వెలికితీసేందుకు పర్యావరణ క్లియరెన్స్ అవసరం లేకుండా ఉండేలా కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ 2024 అక్టోబర్ 17న వివరించారు. 2019-21 మధ్య కాలంలో, ఇసుక కార్యకలాపాలు ఆంధ్ర ప్రదేశ్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) నిర్వహిస్తున్నా, గ్రామాల్లో ఎద్దుల బండ్లు , ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా అనుమతించబడింది. అయితే 2024 సెప్టెంబర్ 2న విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, “స్థానిక అవసరాలకు ఇసుకను పొందడానికి కేవలం ఎద్దుల బండ్లే ఉపయోగించాలి” అని పేర్కొన్నారు.
కానీ, సేకరించిన ఇసుక రవాణా కోసం ఎద్దుల బండ్లు , ట్రాక్టర్‌లను అనుమతించేలా ప్రభుత్వాన్ని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ అభ్యర్థించారు. ఈ అంశంపై ప్రభుత్వం నిశితంగా పరిశీలించి, కమిషనర్ , డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ చేసిన ప్రతిపాదనను ఆమోదించింది. అందుకు అనుగుణంగా, 2024 సెప్టెంబర్ 2న ఇచ్చిన ఉత్తర్వుల్లో పారా ఏ (3)ను సవరించి, “ఎద్దుల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా మాత్రమే స్థానిక అవసరాలకు ఇసుకను పొందవచ్చు” అని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారని అందులో ప్రస్తావించారు.
Dead Butt Syndrome : ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మీకు డెడ్ బట్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం..!