Samantha Fitness: శారీరకంగా శ్రమతో కూడిన సమయం..సామ్ వీడియో వైరల్..!!

స్టార్ హీరోయిన్ సమంత...వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. నాగచైతన్య నుంచి డైవర్స్ తీసుకున్న తర్వాత తిరిగి సింగిల్ స్టేటస్ కు వచ్చేసింది ఈ బ్యూటీ.

  • Written By:
  • Publish Date - April 16, 2022 / 02:49 PM IST

స్టార్ హీరోయిన్ సమంత…వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. నాగచైతన్య నుంచి డైవర్స్ తీసుకున్న తర్వాత తిరిగి సింగిల్ స్టేటస్ కు వచ్చేసింది ఈ బ్యూటీ. ఇప్పుడు మూవీస్ పైన్నే పూర్తి ఫోకస్ పెట్టేసింది. ఇటు తెలుగు, అటు తమిళ్ తో పాటు..బాలీవుడ్ లోనూ పలు సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ బిజీగా మారింది. అలాగే సోషల్ మీడియాలో కూడా సమంత చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఎన్నో విషయాలను తన ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ…వారితో టచ్ లో ఉంటుంది. అయితే తాజాగా సమంత షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోతో పాటు బలమైన శరీరం, బలమైన మనస్సు అంటూనే 2022-23 తనకు శారీరకంగా చాలా శ్రమతో కూడుకున్న సమయం అంటూ సమంత పోస్టు చేసింది.

ఇక గత కొన్నాళ్లుగా సమంత ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టింది. తాజాగా సమంత ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో హెవీవెయిట్ లను అమాంతంగా ఎత్తేస్తోంది. సామ్ తన ట్రైనర్ జునైద్ ఆధ్వరయంలో హేవీ వెయిట్స్ ను సులభంగా ఎత్తేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించి ఓ కామెంట్ కూడా పోస్టు చేసింది. బలమైన మనస్సు అంటూనే 2022-23 తనకు శారీరకంగా చాలా శ్రమతో కూడుకున్న సమయం అని సమంత పోస్టు చేసింది. సామ్ పోస్టు వైరల్ అవుతోంది. సమంత ఫిట్ నెస్ చూసిన అభిమానులు వావ్ అంటున్నారు.

సామ్ ప్రస్తుతం శాంకుతలం, యశోద అనే రెండు పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీస్ అభిమానుల ముందుకు రానున్నాయి. మరోవైపు రాజ్ అండ్ డికెతో కలిసి పనిచేసేందుకు రెడీ అయ్యింది. ఈ బాలీవుడ్ మూవీలో వరుణ్ ధావన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. శివ నిర్మాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో ఓ మూవీలో…మరో హాలీవుడ్ మూవీకి కూడా సైన్ చేసింది సామ్. అంతేకాదు మరోసారి పుష్ప 2లో కూడా సమంత తన స్పెషల్ సాంగ్ తో అభిమానులను అలరించినున్నట్లు తెలుస్తోంది.