Peddi OTT: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పెద్ది.. అధికారిక ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జులై 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను జులై 9న విడుదల చేయనున్నారు. అయితే, హిందీ వెర్షన్ మాత్రం ఆగస్టులో అందుబాటులోకి రానుంది. దక్షిణాది భాషలకు ఐదు వారాల థియేట్రికల్ […]

Published By: HashtagU Telugu Desk
Mega Power Star Ram Charan's 'Peddi' – the official announcement is out; here’s where it will stream.

Mega Power Star Ram Charan's 'Peddi' – the official announcement is out; here’s where it will stream.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జులై 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను జులై 9న విడుదల చేయనున్నారు. అయితే, హిందీ వెర్షన్ మాత్రం ఆగస్టులో అందుబాటులోకి రానుంది. దక్షిణాది భాషలకు ఐదు వారాల థియేట్రికల్ విండో తర్వాత ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారు.

బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, శ్రుతి హాసన్ ఒక ప్రత్యేక గీతంలో అలరించారు. శివ రాజ్‌కుమార్, దివ్యేందు, బోమన్ ఇరానీ, జగపతి బాబు, తారక్ పొన్నప్ప తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

  Last Updated: 04 Jul 2026, 01:04 PM IST