టాలీవుడ్ అందాల హీరోయిన్ సమంత రుతుప్రభు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. చైతూతో బ్రేకప్ చెప్పాక ఆమె దూకుడుగా వ్యవహరిస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. వరుస సినిమాలకు సైన్ చేయడం.. అప్పుడప్పుడు బికినీలో దర్శనివ్వడం.. హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం.. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయడం లాంటి విషయాలతో సోషల్ మీడియాలో హైలైట్ అయ్యింది. అయితే సమంత చైతూ తో బ్రేకప్ చెప్పి నాలుగు నెలలు కావోస్తుంది. నాగచైతన్య విడిపోతున్నట్లు ప్రకటించిన సమయంలో సినీ అభిమానులు అంతా షాక్ అయ్యారు. ఈ అందాల జంట కలిసి ఉండాలని కోరుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది.
అయితే ఈ బ్యూటీ విడాకులకు ముందు ట్విట్టర్లో, ఇన్ స్టాలో ‘సమంత అక్కినేని’ గా అకౌంట్ ఉండేది. ఆ తర్వాత ‘అక్కినేని’ అనే ట్యాగ్ తొలగించడంతో ఇద్దరూ విడిపోతున్నట్టు వార్తలు వినిపించాయి. అనుకున్నట్టుగానూ విడిపోయారు. తాజాగా ఈ సమంత తమ విడాకుల పోస్టును తొలగించడంతో అభిమానులు షాక్ అయ్యారు. మళ్లీ సమంత, చైతన్య కలుస్తారా.. అంటూ రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది!
