Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల… టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందని ఆరోపించారు. చంద్రబాబు ప్రారంభించిన ఈ రాజకీయ దాడుల పర్యవసానం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను తీసుకొస్తుందన్నారు. “తప్పుడు ఆరోపణలు, ఆధారాలు లేని కేసులతో వైసీపీ నాయకులను జైలుకు పంపడం జరుగుతోంది. మాజీ మంత్రి కాకాణిపై పెట్టిన కేసు పూర్తిగా కల్పితమని మేం నమ్ముతున్నాం,” అని అన్నారు.
Bandi Sanjay : కల్వకుంట్ల సినిమాకు..కాంగ్రెస్ ప్రొడక్షన్: బండి సంజయ్
పోలీసుల తీరును కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. తెనాలిలో ముగ్గురు వ్యక్తులను అమానుషంగా కొట్టారని ఆరోపించిన సజ్జల, “రాష్ట్రంలో సిస్టమ్ పూర్తిగా విఫలమైంది. ప్రజలను బట్టలు లేకుండా డాన్సులు చేయించాల్సిన స్థితికి తీసుకువచ్చారు,” అన్నారు. అంతేగాక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలన్న ప్రయత్నం జరుగుతున్నప్పటికీ, అదే బలంగా తిరిగి ఎదుగుదలకి కారణమవుతుందని సజ్జల అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతలపై దాడులు చేస్తారని ముందే అంచనా వేసామని, ఇప్పుడు అదే జరుగుతోందన్నారు.
చంద్రబాబుకు మార్పు అవసరమని, లేదంటే భవిష్యత్తు మరింత భయంకరంగా మారుతుందన్నారు. “వాస్తవానికి జగన్ గారు ఆలోచించి ఉండుంటే, చంద్రబాబును మరొకసారి జైలుకు పంపేవారు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న చంద్రబాబు వాటిని మేనేజ్ చేసుకుంటున్నారు,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, “మేము రాజకీయాల్లోకి రావడం ఏం సాధారణ విషయం కాదు – అన్ని విధాలుగా సిద్ధంగా వచ్చాం. కేసులకు భయపడే ప్రసక్తే లేదు,” అని స్పష్టం చేశారు.
Theatre Bandh Issue : పవన్ కళ్యాణ్ హెచ్చరికను పట్టించుకోము – సి కళ్యాణ్