SS రాజమౌళి RRR విడుదలకు దగ్గరలోనే ఉండటంతో, ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి టీమ్ వివిధ నగరాలకు వెళుతోంది. గ్రాండ్ రిలీజ్‌కు ముందు, దర్శకుడు రాజమౌళితో పాటు ప్రధాన తారాగణం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో సహా బృందం ఆశీర్వాదం కోసం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ని సందర్శించారు. అంతకుముందు ఢిల్లీలో సందడి చేసిన ఆర్ఆర్ఆర్ టీం, ప్రస్తుతం అమృత్‌సర్ కు వెళ్లింది. అక్కడ పూజలు చేసి సినిమా పెద్ద హిట్ కావాలని దేవుడ్ని కోరుకుంది. ఇక ఆర్ఆర్ఆర్ విడుదల సందర్భంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. అటు ఎన్టీఆర్, ఇటు రాంచరణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘RRR’ Team: అమృత్‌సర్ లో ‘ఆర్ఆర్ఆర్’ పూజలు

Rrr