NEET UG 2026: నీట్ రీ ఎగ్జామ్ తేదీ ఖరారు

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ (NEET-UG) 2026 రీ-ఎగ్జామినేషన్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖరారు చేసింది. జూన్ 21న ఈ పరీక్షను తిరిగి నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా ఎన్టీఏ వెల్లడించింది. భారత ప్రభుత్వ ఆమోదంతోనే నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామ్‌ను జూన్ 21న నిర్వహించాలని నిర్ణయించినట్టు ఎన్టీఏ తన పోస్ట్‌లో స్పష్టం చేసింది. “నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, నీట్ (యూజీ) […]

Published By: HashtagU Telugu Desk
Neet Ug 2026 Re Exam Update

NEET UG 2026 Re-Exam Update

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ (NEET-UG) 2026 రీ-ఎగ్జామినేషన్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖరారు చేసింది. జూన్ 21న ఈ పరీక్షను తిరిగి నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా ఎన్టీఏ వెల్లడించింది.

భారత ప్రభుత్వ ఆమోదంతోనే నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామ్‌ను జూన్ 21న నిర్వహించాలని నిర్ణయించినట్టు ఎన్టీఏ తన పోస్ట్‌లో స్పష్టం చేసింది. “నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, నీట్ (యూజీ) 2026 రీ-ఎగ్జామినేషన్‌ను 2026, జూన్ 21న (ఆదివారం నాడు) నిర్వహించాలని నిర్ణయించింది” అని తెలిపింది.

గతంలో జరిగిన నీట్ యూజీ-2026 పరీక్ష రద్దు కావడంతో లక్షలాది మంది వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తాజా ప్రకటనతో వారి ఉత్కంఠకు తెరపడింది. పరీక్షకు సంబంధించిన ఖచ్చితమైన, ప్రామాణిక సమాచారం కోసం కేవలం తమ అధికారిక కమ్యూనికేషన్ ఛానళ్లను మాత్రమే విశ్వసించాలని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎన్టీఏ సూచించింది.

పరీక్షకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే neet-ug@nta.ac.in అనే ఈమెయిల్ ద్వారా గానీ, 011-40759000, 011-69227700 హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా గానీ సంప్రదించవచ్చని ఎన్టీఏ తెలియజేసింది.

  Last Updated: 15 May 2026, 10:51 AM IST