Site icon HashtagU Telugu

RGV: ఆర్జీవి బంపర్ ఆఫర్.. తన ఫొటోకు క్యాప్షన్ పెడితే లక్ష గిఫ్ట్!

rgv

rgv

పబ్ లో చిందులేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆర్జీవీ

మందు, సిగరెట్ తాగుతూ అమ్మాయిలతో చిందులు

ట్విట్టర్ ట్రెండింగ్ లో రచ్చరచ్చ చేస్తున్న రాంగోపాల్ వర్మ వీడియో

లైఫ్ లో ఎంజాయ్ మెంట్ విషయంలో తగ్గేదే లే అంటున్న ఆర్జీవీ

https://twitter.com/RGVzoomin/status/1486897250983120896

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా కూడా అది సంచలనమే అని చెప్పాలి. తన మనసులో ఏది అనిపిస్తే… అదే చేసేస్తాడు. అది ఎవరికి నచ్చినా… నచ్చకపోయినా తనకి అనవసరం. ఇంకా చెప్పాలంటే… తాను తీసే సినిమాలు తనకి నచ్చితే చాలు… ప్రేక్షకులకు నచ్చినా…నచ్చకపోయినా తనకు అవసరం లేదు అని అంటారాయన. అసలు లైఫ్ ని మాత్రం ఆర్జీవీ ఎంజాయ్ చేసినట్టుగా ఎవరూ చేయరంటే అతిశయోక్తి కాదు. ఇక రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ఆక్టివ్ గానే ఉంటారు.

చాలా సందర్భాల్లో ఆయన చేసే ట్వీట్లు బోల్డంత చర్చకు కారణమవుతుంటాయి. తాజాగా ఆర్జీవీ షేర్ చేసిన వీడియోలు కొన్ని తెగ వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లోని ఓ పబ్‌లో అమ్మాయిలతో మందు కొడుతూ… సిగరెట్ తాగుతూ.. చిందులేస్తున్న వీడియోలు ఇవి. ఇంకో వీడియోలో ఒక చేతిలో మందు బాటిల్‌ పట్టుకుని, మరో చేతితో అమ్మాయిని గట్టిగా హగ్ చేసుకున్నాడు ఆర్జీవీ. ఇవే కాకుండా…. ట్విట్టర్ లో ఓ ఫొటోను షేర్ చేస్తూ… తనని అభిమానించే వాళ్లతో పాటు, హేట్ చేసేవాళ్లు కూడా దానికి క్యాప్షన్ చెబితే, లక్ష రూపాయల బహుమానం ఇస్తానని ప్రకటించారు. వర్మ అలా షేర్ చేసిన వెంటనే ట్విట్టర్ లో ఆయనకి రిప్లైల వరద కొనసాగుతోంది.

https://twitter.com/RGVzoomin/status/1486754284687409156